×
Ad

Revolver Rita Review : ‘రివాల్వర్ రీటా’ మూవీ రివ్యూ.. డాన్ వచ్చి హీరోయిన్ ఇంట్లో చనిపోతే ఏం జరిగింది..?

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'రివాల్వర్ రీటా'. (Revolver Rita Review)

Revolver Rita Review

Revolver Rita Review : కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘రివాల్వర్ రీటా’. సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మాణంలో జేకే చంద్రు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. రివాల్వర్ రీటా సినిమా నేడు నవంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(Revolver Rita Review)

కథ విషయానికొస్తే.. ప్రభాకర్ ని భూమి విషయంలో ఒకరు మోసం చేయడంతో 2 కోట్లు పోగొట్టుకొని సూసైడ్ చేసుకుంటాడు. రెడ్డి(అజయ్ ఘోష్) అన్నయ్యని పాండిచ్చేరి డాన్ డ్రాకులా పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్), అతని కొడుకు డ్రాకులా బాబీ(సునీల్) చంపేస్తారు. దీంతో రెడ్డి వాళ్ళని చంపి పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటాడు. రీటా(కీర్తి సురేష్) తన తల్లి చెల్లమ్మ(రాధికా శరత్ కుమార్) తన చెల్లితో కలిసి జాబ్ చేస్తూ బతుకుతూ ఉంటుంది. రీటా అక్క మొగుడు తాగుబోతు, కట్నం కోసం వేధించడంతో అక్క కూడా రీటాతోనే ఉంటుంది.

అనుకోకుండా ఓ రోజు డ్రాకులా పాండ్యన్ బాగా తాగేసి వేరే ఇంటికి వెల్లబోయి రీటా ఇంటికి వెళ్తాడు. అక్కడ రీటా, చెల్లమ్మ పాండ్యన్ తో గొడవ పడుతుండగా అనుకోకుండా చనిపోతాడు. మరో వైపు రెడ్డి పాండ్యన్ ని చంపమని, తల తెచ్చిస్తే డబ్బులు ఇస్తానని కొంతమంది మనుషులను పంపిస్తాడు. పాండ్యన్ రీటా ఇంట్లో చనిపోయాడని వాళ్లకు తెలుస్తుంది. మరి ఈ పాండ్యన్ మరణం నుంచి రీటా ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు? పాండ్యన్ శవం కనపడకుండా చేయడానికి వాళ్ళేం చేసారు? రెడ్డి పంపిన మనుషులు పాండ్యన్ శవం కోసం ఏం చేసారు? మధ్యలో రీటాకు పోలీస్ కామరాజు(జాన్ విజయ్)కి గొడవ ఏంటి? అసలు ప్రభాకర్ కి – రీటాకు సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Andhra King Taluka Review : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ.. ఫేవరేట్ హీరో కోసం అభిమాని ఏం చేసాడు..?

సినిమా విశ్లేషణ..

ఇలాంటి క్రైమ్ కామెడీలు చాలానే వచ్చాయి. అనుకోకుండా ఒకరు చనిపోవడం, అందులో ఇరుక్కున్న వాళ్ళు ఎలా బయటపడతారు, ఆ శవం కోసం పలువురు వెతకడం.. లాంటి కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ రివాల్వర్ రీటా సినిమా కూడా అంతే. కాకపోతే దీనికి కర్మ అనేది తిరిగొస్తుంది అనే పాయింట్ ని జతచేసి ఓపెనింగ్ సీన్ కి – క్లైమాక్స్ కి లింక్ ఇచ్చారు. అయితే ఈ ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ లోనే ఊహించేయొచ్చు.

ఫస్ట్ హాఫ్ అంతా రీటా, ఆమె ఫ్యామిలీ, ఈ డాన్స్ గోల పరిచయాలతో సరిపోతుంది. పాండ్యన్ చనిపోయాక అసలు కథ మొదలవుతుంది కానీ ఆ శవాన్ని పెట్టుకొని వీళ్ళు చేసేది చాలా డ్రమాటిక్ గా సాగదీశారు. ఇంటర్వెల్ కి అందరూ పాండ్యన్ శవం కోసం, రీటా ఫ్యామిలీ కోసం వెతకడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో కాస్త ఆసక్తిగా స్క్రీన్ ప్లే పరిగెడుతుంది కానీ ఆ శవం ఎవరి దగ్గరకు వెళ్తుంది అని కొంచెం సాగదీశారు. చాలా సినిమాల్లో క్లైమాక్స్ లో అందరూ కొట్టుకొని హీరో సేవ్ అయినట్టే ఇందులో కూడా అదే జరుగుతుంది. సినిమాలో ట్విస్ట్ లు ముందే ఊహించొచ్చు. కామెడీ అక్కడక్కడా బాగానే వర్కౌట్ అయింది. రొటీన్ కథ కథనం సినిమా అయినా ఓ సారి చూసేయొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో బాగా నటించింది. రాధిక శరత్ కుమార్ తన డైలాగ్స్, టైమింగ్ తో సీరియస్ సన్నివేశాల్లో నవ్విస్తుంది. తక్కువ డైలాగ్స్ తో నెగిటివ్ షేడ్స్ లో సునీల్ కొత్తగా కనిపించాడు. ఈ సినిమాలో సునీల్ లుక్ బాగుంది. అజయ్ ఘోష్ కూడా తన పాత్రలో మెప్పించారు. తమిళ్ కమెడియన్ రెడిన్ కింగ్స్లీ బాగానే నవ్వించాడు. మొదట విలన్ గా, తర్వాత శవం పాత్రలో సూపర్ సుబ్బరాయన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. జాన్ విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Keerthy Suresh : చిరంజీవిని నేను అవమానించలేదు.. మెగా ఫ్యాన్స్ కి కీర్తి సురేష్ క్షమాపణ.. అయినా ఆ హీరో డ్యాన్సే గొప్పంట..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. రొటీన్ కథ, కథనంతో క్రైమ్ కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొంత సాగదీసిన డ్రమాటిక్ సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘రివాల్వర్ రీటా’ సినిమా హీరోయిన్ చుట్టూ తిరిగే ఓ రొటీన్ క్రైమ్ కామెడీ. ఓ సారి చూడొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమాకు రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.