Keerthy Suresh : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కు పోటీగా కీర్తి సురేష్

'నేను శైల‌జ' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిన్న‌ది కీర్తి సురేష్‌.

Keerthy Suresh : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కు పోటీగా కీర్తి సురేష్

Keerthy Suresh Raghu Thatha to clash with Allu Arjun Pushpa 2

Updated On : May 31, 2024 / 3:19 PM IST

Keerthy Suresh – Raghu Thatha : నేను శైల‌జ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిన్న‌ది కీర్తి సురేష్‌. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మ‌హాన‌టితో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గ‌తేడాది ద‌స‌రా మూవీతో బ్లాక్‌బాస్ట‌ర్‌ను అందుకుంది. కాగా.. తెలుగు సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన అమ్మ‌డు ప్ర‌స్తుతం త‌మిళ్‌, బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

కీర్తి న‌టిస్తున్న చిత్రాల్లో ‘ర‌ఘు తాతా’ ఒక‌టి. సుమ‌న్‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తుండగా ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. షాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది.

Sathyaraj : మ‌హేశ్-రాజ‌మౌళి సినిమాలో క‌ట్ట‌ప్ప‌.. అస‌లు నిజం ఇదే..

కాగా.. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌కటించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించారు. హృద‌యాన్ని క‌దిలించే ర‌ఘు తాతా చిత్రం 15 ఆగ‌స్టు 2024న రిలీజ్ కానుంది అని కీర్తి సోష‌ల్ మీడియాలో తెలిపింది.

ఇక అదే రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 విడుద‌ల కానుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ బాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. పుష్ప‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Mahesh Babu : తండ్రిని త‌లుచుకుంటూ మ‌హేశ్ బాబు ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. ‘నా ప్ర‌తి జ్ఞాప‌కంలో నువ్వుంటావు నాన్న‌..’