Beauty Trailer: నిన్ను వదలడంమంటే ఊపిరి వదిలేయడమే.. యూత్ ఫుల్ కంటెంట్ తో బ్యూటీ ట్రైలర్

యంగ్ హీరో అంకిత్‌ కొయ్య, నీలఖి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ బ్యూటీ (Beauty Trailer). యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను జేఎస్‌ఎస్‌ వర్ధన్‌ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు.

Beauty Trailer: నిన్ను వదలడంమంటే ఊపిరి వదిలేయడమే.. యూత్ ఫుల్ కంటెంట్ తో బ్యూటీ ట్రైలర్

Naga Chaitanya releases the trailer of Beauty movie

Updated On : September 14, 2025 / 8:12 AM IST

Beauty Trailer: యంగ్ హీరో అంకిత్‌ కొయ్య, నీలఖి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ బ్యూటీ. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను జేఎస్‌ఎస్‌ వర్ధన్‌ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌(Beauty Trailer) ను టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేశాడు. ఈ విషయాన్న చైతన్య స్వయంగా ట్వీట్ చేశాడు.

SSMB 29: కెన్యా షెడ్యూల్ కంప్లీట్.. ఇక ఇండియాలోనే.. ఎస్ఎస్ఏంబీ 29 క్రేజీ న్యూస్

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఎప్పుడన్నా నేను నిన్ను కోప్పడితే నన్నలా వదిలిపెట్టి వెళ్లిపోకు అని అంకిత్‌ చెప్ డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. లవ్‌ ట్రాక్‌, ఫాథర్- డాటర్ రిలేషన్‌ వంటి ఎమోషన్స్ తో సాగింది. ఈ సినిమాలో మరోసారి తన వింటేజ్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోనున్నాడు సీనియర్ నటుడు నరేష్. కూతురు అడిగింది ఇచ్చేటప్పుడు వచ్చే కిక్కు ఒక్క మధ్య తరగతి తండ్రికే మాత్రమే తెలుస్తుంది అనే డైలాగ్, తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను అంటూ వచ్చే డైలాగ్స్ తండ్రికి కూతురుపై ఉండే ఎమోషన్ ని తెలియజేశాయి.

ఇవన్నీ చూస్తుంటే.. ప్రెజెంట్ జనరేషన్ కి అవసరమైన చాలా కంటెంట్ ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ విషయంలో ఆడియన్స్ ను మాత్రం ఈ ట్రైలర్ ఆకట్టుకుంది అనే చెప్పాలి. మరి విడుదల తరువాత కూడా ఈ సినిమాకు అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు బేబీ, కోర్ట్ లాంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన విజయ్ బల్గానిన్ సంగీతం సంగీతం అందిస్తున్నాడు.