Keerthy Suresh
Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ గతంలో భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం తమిళ మీడియాలో కీర్తి సురేష్ ని మీ దృష్టిలో చిరంజీవి – విజయ్ వీరిద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని అడగడంతో కీర్తి విజయ్ అని చెప్పింది. యాంకర్ ఆ ప్రశ్నని పొడిగించినా తమిళ్ స్టార్ హీరో విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అనే చెప్పింది కీర్తి సురేష్. దీంతో కీర్తి కామెంట్స్ వైరల్ గా మారి మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు.(Keerthy Suresh)
తమిళ్ లో విజయ్ స్టార్ హీరో. ఆయనకు పవన్ కళ్యాణ్ రేంజ్ ఉంది అక్కడ. కానీ విజయ్ డ్యాన్స్ అంతగా ఉండదు అని అందరికి తెలిసిందే. విజయ్ డ్యాన్స్ పై సోషల్ మీడియాలో బోలెడన్ని ట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక మెగాస్టార్ అంటేనే డ్యాన్స్, టాలీవుడ్ లో ఎన్నో రకాల కొత్త డ్యాన్స్ లను పరిచయం చేసిందే చిరంజీవి. డ్యాన్స్ విషయంలో చిరంజీవి గిన్నిస్ రికార్డ్ కూడా అందుకున్నారు. అలాంటిది చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయి ఫీల్ అయ్యారు.
Also Read : Aadi Saikumar : రెండో సారి తండ్రి కాబోతున్న హీరో.. పోస్ట్ వైరల్.. త్వరలోనే సినిమా రిలీజ్..
తాజాగా కీర్తి ఈ వివాదంపై స్పందించింది. కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా అనే సినిమా నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు తెలుగు మీడియాతో మాట్లాడింది. ఓ మీడియా ప్రతినిది ఈ చిరంజీవి – విజయ్ డ్యాన్స్ వివాదంపై కీర్తి సురేష్ ని ప్రశ్నించారు.
దీనికి కీర్తి సురేష్ సమాధానమిస్తూ.. ఇది ఎవరు బెటర్ అని కాదు. చిరంజీవి గారికి తెలుసు నేను విజయ్ గారికి ఎంత పెద్ద అభిమాని అని. నాకు చిరంజీవి గారంటే ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఇష్టం. ఆయనను గౌరవిస్తాను. నేను ఈ విషయం ఆయనకు కూడా చెప్పాను. ఇది తప్పుగా చెప్పాలని కాదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ హర్ట్ అయి ఉంటే క్షమించండి. చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు కూడా మేము సరదాగా మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఆయన నీ ఫేవరేట్ యాక్టర్, సినిమాలు, డ్యాన్సర్ అని అడిగారు. అప్పుడు కూడా నేను విజయ్ సర్ డ్యాన్స్ అంటే ఇష్టం అనే చెప్పాను చిరంజీవి గారికి. ఆయన చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు.
అలా అక్కడ ఇంటర్వ్యూలో అడిగితే అక్కడ కూడా విజయ్ సర్ పేరు చెప్పాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత గొప్పో అందరికి తెలుసు. ఎవరికి వాళ్ళు గొప్ప. మా అమ్మ కూడా చిరంజీవితో సినిమా చేసింది. నేను ఆయన్ని అవమానించే విధంగా ఏది మాట్లాడలేదు. చిరంజీవి గారు ఇక్కడ ఎంత గొప్పో విజయ్ సర్ అక్కడ అంతే గొప్ప. నన్ను అడిగినప్పుడు నా ఛాయస్ ఉంటుంది. అందుకే అది చెప్పాను. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ విజయ్ గారి సినిమాలు చూసాను కాబట్టి ఆయన ఇష్టం, ఆయన పేరు చెప్పాను. చిరంజీవి గారిని ఏమన్లేదు. ఒకవేళ ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి. కానీ ఏది ఇష్టమో చెప్పడానికి ఇది నా ఛాయస్ అని తెలిపింది.
దీంతో కీర్తి చిరంజీవి ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పినా ఇప్పటికి కూడా విజయ్ బెస్ట్ డ్యాన్సర్, విజయ్ అంటే తనకు ఇష్టం, ఇక్కడ చిరంజీవి ఎంతో అక్కడ విజయ్ అంతే, విజయ్ డ్యాన్స్ ఇష్టమని చిరంజీవికి కూడా చెప్పాను, ఇది నా ఛాయస్ అని చెప్పడంతో మరోసారి ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మొత్తానికి చిరంజీవి విజయ్ కంటే బెస్ట్ డ్యాన్సర్ అని మాత్రం కీర్తి ఒప్పుకోలేదు అంటున్నారు ఫ్యాన్స్.
#KeerthySuresh clarifies her comments amid the ‘best dancer’ discussion around #ThalapathyVijay and #Chiranjeevi.pic.twitter.com/8UuBVpkI0H
— Milagro Movies (@MilagroMovies) November 26, 2025