Keerthy Suresh: అదో కొత్త ప్రయాణం.. కానీ, ఆస్వాదిస్తున్నా.. కీర్తి సురేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఓపక్క హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది స్టార్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh). పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది.

Keerthy Suresh's interesting comments on doing a film in Bollywood

Keerthy Suresh: ఓపక్క హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది స్టార్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh). పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈనేపథ్యంలోనే ఇటీవల ఆమె ప్రముఖ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన సినిమాల గురించి, తదుపరి చేయబోతున్న సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Arundhati: హిందీలో అరుంధతి రీమేక్.. హీరోయిన్ గా శ్రీలీల.. మెగా డైరెక్టర్ మెగా ప్లాన్

“సినీ ఇండస్ట్రీలో నేను చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. అందుకే వరుసగా సినిమాలను ఒకే చేయడం లేదు. ఓపక్క గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోపక్క పాత్ర ప్రధానమైన సినిమాలు చేసేలా పప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడిన కీర్తి, బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమా చేశాను. ఇది తమిళ తెరీ సినిమాకు రీమేక్. అది నా కెరీర్‌లో మరో ఉత్తేజకరమైన అధ్యాయం అని చెప్పాలి. కేవలం నన్ను సవాలు చేసే పాత్రల కోసం, కొత్త కొత్త కథల కోసం మాత్రమే బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. అక్కడ పనిచేసే విధానం, వారి సంస్కృతి కొత్తగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. మొత్తంగా ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను.

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ అవ్వాలంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని మా నాన్న కండీషన్ పెట్టారు. ఆ మక్కువతోనే చదువులో కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఆప్టిన్ తీసుకున్నా” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె రివాల్వర్ రీటా, కన్నెవెడి సినిమాలు చేస్తుంది. ఈ రెండు ప్రస్తతం షూటింగ్ దశలో ఉన్నాయి. తత్వరలోనే ఈ రెండు సినిమాల విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.