Arundhati: హిందీలో అరుంధతి రీమేక్.. హీరోయిన్ గా శ్రీలీల.. మెగా డైరెక్టర్ మెగా ప్లాన్
అరుంధతి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదొక బెంచ్ మార్క్ అనే చెప్పాలి(Arundhati). ఈ సినిమాలో అనుష్క విశ్వరూపం చూపించింది అనే చెప్పాలి. జేజమ్మగా, అరుంధతిగా ఆమె కనబరిచిన నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

Srileela to star in Hindi remake of Arundhati
Arundhati: అరుంధతి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదొక బెంచ్ మార్క్ అనే చెప్పాలి. ఈ సినిమాలో అనుష్క విశ్వరూపం చూపించింది అనే చెప్పాలి. జేజమ్మగా, అరుంధతిగా ఆమె కనబరిచిన నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అరుంధతి(Arundhati) అంటే అనుష్కనే అనే రేంజ్ లో ఆమె ఆ పాత్రలో జీవించేశారు. దర్శకుడు కోడి రామకృష తెరకెక్కించిన ఈ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ హా నిలించింది. ఆ తరువాత అనుష్క చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ, ఏ సినిమా కూడా అరుంధతి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాయి.
Peddi: పెద్ది నుంచి క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్ తల్లిగా ఎవరు చేస్తున్నారో తెలుసా?
అలాగే ఈ సినిమాను దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో రీమేక్ చేశారు కానీ, అనుష్క నటనను, ఆమె రాజసాన్ని ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. అయితే, ఆమధ్య హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. హీరోయిన్ గా దీపికా పదుకొనెను కూడా ఫైనల్ చేశారు. కానీ, ఆ ప్రాజెక్టు ఎందుకో క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ ఇంత కాలానికి హిందీలో అరుంధతి సినిమాను రీమేక్ చేయబోతున్నారట. దీనికి సంబందించిన ఒక క్రేజీ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ప్రాజెక్టు కోసం లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీలను తీసుకోబోతున్నారట. భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్ తో రానున్న ఈ సినిమాను మెగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించబోతున్నాడట. మోహన్ రాజా తెలుగులో హనుమాన్ జంక్షన్, చిరజీవితో గాడ్ ఫాథర్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ దర్శకుడు శ్రీలీలతో అరుంధతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి, అరుంధతి సినిమా విడుదలైన దాదాపు 14 ఏళ్ళ తరువాత రీమేక్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతిని పంచుతుందో చూడాలి.