Peddi: పెద్ది నుంచి క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్ తల్లిగా ఎవరు చేస్తున్నారో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది(Peddi). పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.

actress VG Chandrasekhar playing Ram Charan's mother role in Peddi movie
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అనౌన్ మెంట్ వచ్చినప్పటినుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన (Peddi)టీజర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమా నుంచి మరి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లిగా ఒక సీనియర్ నటి కనిపించనుందట. ఆ నటి మరెవరో కాదు విజి చంద్రశేఖర్. ఇటీవల ఆమె అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి మెప్పించారు. ఇప్పుడు ఆమె రామ్ చరణ్ కు తల్లిగా నటిస్తున్నారు. సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే, ఆ పాత్ర కోసం విజి చంద్రశేఖర్ ను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఆమె కు రామ్ చరణ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ను తెరక్కిస్తున్నారట. సెకండ్ హాల్ఫ్ లో వచ్చే ఈ సీన్స్ సినిమాకే హైలెట్ కానున్నాయట.
ఇక పెద్ది సినిమాకు ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా పెద్ది సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ విషయంపై ఇప్పటికే రామ్ చరణ్ సొసైల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఇక అప్పటినుండి ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా 2026 మర్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఆయన కు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.