Priyanka Mohan: డబ్బులిచ్చి నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు.. నాకు అన్నీ తెలుసు.. ప్రియాంక మోహన్ షాకింగ్ కామెంట్స్

మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు(Priyanka Mohan). తనపై కొంతమంది కావాలని ట్రోల్స్ చేస్తున్నారని, అవకాశాలు తగ్గడానికి కారణం కూడా అదే అని, నాకు అన్ని తెలుసు అని చెప్పుకొచ్చింది.

Priyanka Mohan: డబ్బులిచ్చి నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు.. నాకు అన్నీ తెలుసు.. ప్రియాంక మోహన్ షాకింగ్ కామెంట్స్

Priyanka Mohan makes shocking comments on trolling her

Updated On : September 16, 2025 / 11:56 AM IST

Priyanka Mohan: మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై కొంతమంది కావాలని ట్రోల్స్ చేస్తున్నారని, అవకాశాలు తగ్గడానికి కారణం కూడా అదే అని, నాకు అన్ని తెలుసు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి ప్రియాంక మోహన్(Priyanka Mohan) పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఆమె నటనపై, ఎక్స్ ప్రెషన్స్ పై కావాలని కొంతమంది నెగిటీవ్ గా కాకామెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల ఆమె అవకాశాలు కూడా తగ్గిపోవడం జరిగింది.

Shanmukh Jaswanth: ప్రేమకు నమస్కారం.. షణ్ముఖ్ ఫస్ట్ సినిమా టీజర్ వచ్చేసింది

తాజాగా ఈ విషయం ప్రియాంక వరకు వెళ్లడంతో ఆమె సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నాపై వస్తున్న ట్రోలింగ్స్ కావాలనే చేయిస్తున్నారు. అవన్నీ పైడ్ ట్రోలింగ్స్. కొంతమంది కావాలని డబ్బులిచ్చి మరీ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కేవలం నా ఇమేజ్ ను డ్యామేజ్ చెయ్యడానికి ఇలా చేస్తున్నారు. అవన్నీ నాకు తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమెపై కావాలని అలా ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఉన్న సంచరం మేరకు తమిళ స్టార్స్ తో వర్క్ చేసే ప్రముఖ ఏజెన్సీ తో ప్రియాంక ఒప్పందం క్యాన్సల్ చేసుకోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. కావాలనే ఆమెపై నెగటివ్ స్ప్రేడ్ చేసి అవకాశాలు రాకుండా చేస్తున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఈ ఇష్యుపై ప్రియాంక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.. నాని నటించిన జియాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమెపవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.