కేజీఎఫ్ 2 షూటింగ్ నిలిపి వేయాలంటూ కోర్టు తీర్పు
షూటింగ్ కారణంగా పర్యావరణానికి హానికలుగుతోందంటూ కేజీఎఫ్ 2 షూటింగ్‌ని నిలిపి వేేయాలంటూ కోర్టు తీర్పునివ్వడంతో మరో లొకేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది మూవీ టీమ్..

షూటింగ్ కారణంగా పర్యావరణానికి హానికలుగుతోందంటూ కేజీఎఫ్ 2 షూటింగ్‌ని నిలిపి వేేయాలంటూ కోర్టు తీర్పునివ్వడంతో మరో లొకేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది మూవీ టీమ్..
రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. హోమ్‌బేల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన కేజీఎఫ్ మూవీకి సీక్వెల్‌గా.. కేజీఎఫ్ చాప్టర్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్‌కి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, చాప్టర్ 2 ని భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
కథలో భారీతనంతో పాటు.. భారీ తారాగణం కూడా సెకండ్ పార్ట్‌లో ఉంటాయంటున్నారు. చాప్టర్ 1లో అధీరా అనే క్యారెక్టర్‌ను సస్పెన్స్‌లో పెట్టగా, చాప్టర్ 2లో ఆ క్యారెక్టర్‌ను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 షూటింగ్‌ని నిలిపి వేేయాలంటూ బెంగుళూరు కోర్టు తీర్పునివ్వడంతో యూనిట్ షాక్ అయ్యింది. వివరాళ్లోకి వెళ్తే.. కోలార్ ఫీల్డ్స్‌లోని సైనైడ్ హిల్స్‌లో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతోందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక కోర్టును ఆశ్రయించారు.
Read Also : ప్రస్థానం – ట్రైలర్..
దీంతో అతని వాదనలు విన్న కోర్టు.. సినిమా షూటింగ్‌ను నిలిపివేయాలని చెప్పడంతో.. చేసేదేం లేక మరో లొకేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది మూవీ టీమ్.. 2020 సమ్మర్లో కేజీఎఫ్ 2 రిలీజ్ కానుంది.