‘కె.జి.యఫ్ 2’ షూటింగ్ స్టార్ట్.. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటి?..

  • Published By: sekhar ,Published On : August 26, 2020 / 12:17 PM IST
‘కె.జి.యఫ్ 2’ షూటింగ్ స్టార్ట్.. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటి?..

Updated On : August 26, 2020 / 12:47 PM IST

KGF Chapter 2 shoot resumes: రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.



లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ‘కె.జి.యఫ్2’ షూటింగ్ ఈరోజు(ఆగస్ట్ 26) తిరిగి ప్రారంభమైంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. బ్యాక్ టు వర్క్’.. అంటూ సెట్‌లో తీసిన పిక్స్ షేర్ చేశారు ప్రకాష్ రాజ్.. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
https://10tv.in/heres-the-dish-that-shah-rukh-khan-can-eat-365-days-a-year/
పదిరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో కేవలం క్లైమాక్స్ ఫైట్ మినహా మొత్తం సినిమా షూటింగ్ పూర్తయినట్లే. తొలి భాగాన్ని మించి రెండో భాగం సంచలన విజయం సాధించడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి సంగతి తెలిసిందే.