Kgf2 Becomes 2nd Highest Grossing Film In Bollywood
KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలిభాగం కేజీయఫ్ చాప్టర్ 1 బ్లాక్‌బస్టర్ మూవీగా నిలవడంతో, కేజీయఫ్2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీయఫ్ 2 టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు కన్నడ ఆడియెన్స్ కంటే ఎక్కువగా ఇతర భాషా ఆడియెన్స్ ఆసక్తిని కనబరిచారు. దీంతో ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.
KGF2: అఫీషియల్.. వెయ్యి కోట్ల క్లబ్‌లో కేజీయఫ్2
‘కేజీయఫ్ చాప్టర్ 2’ కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా దిమ్మతిరిగే వసూళ్లతో అదరగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 రోజులు పూర్తయినా, బాలీవుడ్‌లో కేజీయఫ్ 2 ఇంకా తన దూకుడును చూపిస్తూనే ఉంది. హిందీలో ఇటీవల ఇలాంటి యాక్షన్ డోస్ మూవీ రాకపోవడంతో, అక్కడి జనం కూడా ఈ సినిమాకే ఓటేస్తూ కలెక్షన్ల వరద కురిపిస్తున్నారు. ఇక తాజాగా కేజీయఫ్2 హిందీ వెర్షన్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
KGF2: ఆగని రాఖీభాయ్ దూకుడు.. బాలీవుడ్‌లో పర్ఫామెన్స్ పీక్స్!
హిందీ భాషలో రిలీజ్ అయిన సినిమాల్లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్ర వసూళ్లను అధిగమిస్తూ కేజీయఫ్ 2 టాప్ రెండో ప్లేస్‌ను దక్కించుకుంది. ఇప్పటివరకు టాప్ 1 స్థానంలో బాహుబలి 2 రూ.510.99 కోట్ల కలెక్షన్స్‌తో తన సత్తా చాటగా, రెండో ప్లేస్‌లో అమీర్ ఖాన్ దంగల్ చిత్రం రూ.387.38 కోట్ల వసూళ్లతో ఉంది. అయితే తాజాగా రూ.391 కోట్లతో కేజీయఫ్ 2, అమీర్ ఖాన్ దంగల్ రికార్డును అధిగమించి టాప్ రెండో ప్లేస్‌ను ఆక్రమించేసింది. దీంతో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ రెండు సినిమాలు కూడా దక్షిణాదివి కావడం విశేషం అని చెప్పుకోవాలి. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్2లో హీరో యశ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
BIGGG NEWS… #KGF2 surpasses #Dangal *lifetime biz*… NOW, 2ND HIGHEST GROSSING *HINDI* FILM… Glorious march towards ₹ 400 cr begins… [Week 3] Fri 4.25 cr, Sat 7.25 cr, Sun 9.27 cr, Mon 3.75 cr, Tue 9.57 cr, Wed 8.75 cr. Total: ₹ 391.65 cr. #India biz. #Hindi pic.twitter.com/PdImtreDrB
— taran adarsh (@taran_adarsh) May 5, 2022