KGF2: అఫీషియల్.. వెయ్యి కోట్ల క్లబ్‌లో కేజీయఫ్2

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీయఫ్-2’ రిలీజ్‌కు ముందే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తొలి భాగం కేజీయఫ్ చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా....

KGF2: అఫీషియల్.. వెయ్యి కోట్ల క్లబ్‌లో కేజీయఫ్2

Official Kgf2 Joins 1000 Crore Club

KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీయఫ్-2’ రిలీజ్‌కు ముందే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తొలి భాగం కేజీయఫ్ చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలవడంతో, కేజీయఫ్ సీక్వెల్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 సినిమాను తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.

KGF2: డబ్బింగ్ సినిమాల్లో నైజాం నవాబుగా రాఖీ భాయ్!

ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీయఫ్ 2, తొలిరోజే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత ఈ సినిమా ఎక్కడా కూడా బ్యాక్‌స్టెప్ వేయలేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కుంభవృష్టిని కురిపిస్తూ ఈ సినిమా తన దూకుడును చూపించింది. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో రాఖీ భాయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన కేజీయఫ్‌లో కథే బలం కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

KGF2: ఆగని రాఖీభాయ్ దూకుడు.. బాలీవుడ్‌లో పర్ఫామెన్స్ పీక్స్!

ఇక మాస్ వర్గాలను పూర్తిగా మెస్మరైజ్ చేసే హీరో ఎలివేషన్స్ ఈ సినిమాలో ప్రతిచోటా మనకు కనిపించడంతో వారు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందని పలువురు ట్రేడ్ నిపుణులు జ్యోస్యం చెప్పారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ రంజాన్ రోజున ఈ సినిమా అఫీషియల్‌గా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరి తన సత్తా చాటింది. యశ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ టేకింగ్‌లు కలిసి కేజీయఫ్2 చిత్రాన్ని మరో లెవెల్‌లో నిల్చోబెట్టాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.