KGF2: డబ్బింగ్ సినిమాల్లో నైజాం నవాబుగా రాఖీ భాయ్!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ మాస్ యాక్షన్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’పై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1....

KGF2: డబ్బింగ్ సినిమాల్లో నైజాం నవాబుగా రాఖీ భాయ్!

Kgf2 New Record In Nizam

KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ మాస్ యాక్షన్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’పై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1 బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలవడంతో, ఈ సీక్వెల్ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీయఫ్2 చిత్రం రావడంతో థియేటర్లలో రాఖీ భాయ్ హవా జోరుగా కొనసాగింది. హీరో యశ్ ఈ సినిమాతో దేశవ్యాపత్తంగా తన క్రేజ్‌ను మరింత పెంచేసుకున్నాడు.

KGF2: ఆగని రాఖీభాయ్ దూకుడు.. బాలీవుడ్‌లో పర్ఫామెన్స్ పీక్స్!

అయితే కథలో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి భాష అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని కేజీయఫ్ చాప్టర్ 2 మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు తెలుగు నాట కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లు రాబడుతోంది. కేజీయఫ్2 చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు 20 రోజులు కావస్తున్నా, తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వేట మాత్రం తగ్గలేదు. తాజాగా కేజీయఫ్2 మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నైజాం ఏరియాలో ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా కూడా సాధించని రికార్డును కేజీయఫ్ చాప్టర్ 2 తన పేరిట రాసుకుంది.

KGF2: బాలీవుడ్‌లో కేజీయఫ్2 తుఫాన్.. ఇప్పట్లో ఆగేలా లేదుగా!

నైజాం ప్రాంతంలో ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టి, డబ్బింగ్ సినిమాల్లోనే టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. తెలుగు మూవీ ఆచార్య పోటీలో ఉన్నప్పటికీ, కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా ఇంకా తన సత్తా చాటుతుండటం విశేషం. ఇక ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయగా, యశ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.