Kgf2
KGF2: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించన కేజీయఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఈ సినిమా కరోనా-లాక్‌డౌన్ కారణంగా ఆలస్యం అవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఉవ్విళ్లూరారు. అయితే ఏప్రిల్ 14న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపుతున్నారు.
KGF2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కేజీయఫ్-2
కేజీయఫ్2 తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టింది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.134 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా తొలిరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.19.51 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడంతో ఈ సినిమా రానున్న రోజుల్లో తన వసూళ్లను పెంచుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా రెండో రోజు కూడా కేజీయఫ్ 2 హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగింది.
KGF2: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కేజీయఫ్2 వసూళ్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండో రోజు రూ.12.95 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది. ఇక వీకెండ్ కావడంతో శని,ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా ఎంతమేర వసూళ్లను రాబడుతుందో చూడాలి. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాలవారీగా కేజీయఫ్2 కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 16.87 కోట్లు
సీడెడ్ – 4.79 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.91 కోట్లు
గుంటూరు – 2.84 కోట్లు
ఈస్ట్ – 1.96 కోట్లు
వెస్ట్ – 1.34 కోట్లు
కృష్ణా – 1.58 కోట్లు
నెల్లూరు – 1.17 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.32.46 కోట్లు