KGF2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కేజీయఫ్-2

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఎట్టకేలకు రిలీజ్ కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.....

KGF2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కేజీయఫ్-2

Kgf2 Locks Ott Streaming Partner

KGF2: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఎట్టకేలకు రిలీజ్ కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు తొలిరోజు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో, కేజీయఫ్ 2 మున్ముందు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా కేజీయఫ్ చాప్టర్ 2ను తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

KGF2: చాప్టర్-3 స్టార్ట్ అయ్యేది అప్పుడే..?

ఇక ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చిత్ర యూనిట్ చేయగా.. ఈ సినిమా కళ్లుచెదిరే ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇప్పటికే ఈ సినిమాను అత్యంత భారీ రేటుకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయగా.. తాజాగా కేజీయఫ్2 ఓటీటీ పార్ట్‌నర్‌ను చిత్ర యూనిట్ ఫైనల్ చేశారు. గతంలో కేజీయఫ్ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, కేజీయఫ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ‘జీ’ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కళ్లుచెదిరే రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఫిగర్ ఎంతన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

KGF2: మరోసారి మెప్పించిన రవీనా!

అయితే ఏరియాలవారీగా ఈ చిత్ర కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. రవి బస్రుర్ సంగీతం అందించిన కేజీయఫ్-2 సినిమాను హొంబాలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసింది. మరి కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే మరికొద్ద రోజులు వెయిట్ చేయాల్సిందే.