KGF2: మరోసారి మెప్పించిన రవీనా!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు....

KGF2: మరోసారి మెప్పించిన రవీనా!

Raveena Tandon Role In Kgf2 Gets Huge Applause

KGF2: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీగా తెరకెక్కించడంతో కేజీయఫ్2‌ను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాకు అన్ని చోట్లా కూడా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ విజయంవైపు దూసుకెళ్తోంది. పాన్ ఇండియా హీరోగా యశ్, ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయాడు.

KGF2: చాప్టర్-3 స్టార్ట్ అయ్యేది అప్పుడే..?

కల్ట్ మాస్ మూవీగా కేజీయఫ్2 ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమాలోని నటీనటులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. రాఖీ భాయ్ పాత్రలో యశ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కేజీయఫ్ చాప్టర్-1 లోనే మనం చూశాం. అయితే కేజీయఫ్ చాప్టర్ 2లో కొత్తగా చేరిన సంజయ్ దత్, రవీనా టండన్ పాత్రల గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో అధీరా పాత్రలో సరికొత్త లుక్‌తో కనిపించి వావ్ అనిపించాడు సంజయ్ దత్. అయితే కేజీయఫ్ 2 సినిమా మొత్తానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మాత్రం రవీనా టండన్ పాత్ర నిలిచిందని చెప్పాలి.

మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తరహా పాత్రలో రవీనా టండన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రాఖీ చేస్తున్న గోల్డ్ మైనింగ్ దందాకు అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా ప్రయత్నించే పాత్రలో రవీనా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలు చేయడం రవీనాకు కొత్తేమీ కాదు. కానీ.. రమిక సేన్ అనే పొలిటికల్ లీడర్ పాత్రలో రవీనా ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక రాఖీతో రమిక సేన్ ఎదురపడే సీన్స్‌లో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వచ్చాయని అంటున్నారు. అటు చిత్ర యూనిట్ కూడా రవీనా పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారు.

KGF2: బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్.. తొలిరోజు వసూళ్లతో విధ్వంసం..!

ఓ ఇంటర్వ్యూలో నటుడు సంజయ్ దత్ కూడా ఇదే విషయాన్ని తెలిపాడు. రమిక సేన్ లాంటి పాత్రలో రవీనా పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అటు తనకు ఇలాంటి పాత్రను ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు రవీనా థ్యాంక్స్ చెబుతోంది. చాలా రోజుల తరువాత తన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రగా రమిక సేన్ నిలిచిపోతుందని రవీనా అంటోంది. మొత్తానికి కేజీయఫ్ 2 హీరో యశ్‌తో పాటు రవీనా లాంటి సీనియర్ నటులకు కూడా మంచి పేరును తీసుకురావడం విశేషమని చెప్పాలి.