చావునైనా ఎదిరించి చావాలి : ఖైదీ ట్రైలర్
కార్తీ నటిస్తున్న తమిళ సినిమా.. ‘ఖైదీ’.. తెలుగులో ‘ఖైదీ’ పేరుతోనే విడుదల కానుంది.. రీసెంట్‌గా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు..

కార్తీ నటిస్తున్న తమిళ సినిమా.. ‘ఖైదీ’.. తెలుగులో ‘ఖైదీ’ పేరుతోనే విడుదల కానుంది.. రీసెంట్‌గా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు..
కార్తీ నటిస్తున్న తమిళ సినిమా.. ‘ఖైదీ’.. ‘మా నగరం’ సినిమాతో ప్రేక్షకలను అలరించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దోపిడీలు, డ్రగ్స్ రవాణా మరియు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘ఖైదీ’ పేరుతోనే విడుదల కానుంది.
రీసెంట్‌గా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. కార్తీ రఫ్ అండ్ టఫ్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించగా, నరేన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. సినిమాలో కూతురు సెంటిమెంట్ హైలెట్ అవుతుందని మూవీ టీమ్ చెప్తోంది. విజువల్స్, ఆర్‌ఆర్ బాగున్నాయి. విజయ్ టివి దీనా, మరియమ్ జార్జ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. దీపావళికి తమిళ్‌తో పాటు తెలుగులోనూ ‘ఖైదీ’ భారీగా విడుదల కానుంది.
Read Also : కోల్‌కతా ‘మైదాన్’లో అజయ్ దేవ్‌గణ్ మ్యాచ్..
సిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, మ్యూజిక్ : శ్యామ్ సిఎస్, ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ : ఎన్. సతీష్ కుమార్, స్టంట్స్ : అన్బరివు, డైలాగ్స్ : పోన్ పార్థిబన్, లోకేష్ కనగరాజ్, నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, తిరుప్పుర్ వివేక్.