బాహుబలి సత్తా : ఖామోషీతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ
రీసెంట్‌గా ఖామోషీ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఖామోషీ టీజర్ దడ పుట్టిస్తుంది..

రీసెంట్‌గా ఖామోషీ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఖామోషీ టీజర్ దడ పుట్టిస్తుంది..
ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా, భూమికా చావ్లా ప్రధాన పాత్రధారులుగా, ‘ఈనాడు’, ‘బిల్లా-2’, ‘వెల్ కమ్ టు న్యూయార్క్’ సినిమాల దర్శకుడు చక్రి తోలేటి దర్శకత్వంలో, పీవైఎక్స్ సంస్థ నిర్మిస్తున్నబాలీవుడ్ సినిమా.. ఖామోషీ.. 2017లోనే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్‌గా ఖామోషీ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఖామోషీ టీజర్ దడ పుట్టిస్తుంది. తమన్నా బధిర యువతిగా కనిపిస్తే, ప్రభుదేవా విలన్‌గా తన ఎక్స్ ప్రెషన్స్‌తోనే భయపెట్టేసాడు.
ఖామోషీలో ప్రభుదేవాది సైకో క్యారెక్టర్ అని అర్థమవుతుంది. ‘వన్స్ హి గెట్స్ యూ, హి విల్ నాట్ లీవ్ యూ’ అంటూ, ప్రభు పాత్ర ఎంత క్రూరంగా ఉండబోతుందో చెప్పారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.. మే 31న ఖామోషీ రిలీజ్ కానుంది. సంజయ్ సూరి, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ఫొటోగ్రఫీ : కారీ గెర్యాక్, ఎడిటింగ్ : శక్తి హసిజా, స్టోరీ, స్ర్కీన్‌ప్లే : ధీరజ్ రత్తన్, కో-ప్రొడ్యూసర్ : సౌరభ్ మిశ్రా.
వాచ్ ఖామోషీ టీజర్..