Kiara Advani: ఒలంపిక్ హీరో నీరజ్‌పై కియారా క్రష్ కామెంట్స్

కియారా అద్వానీ బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బీ టౌన్ లో ఇప్పుడున్న క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ దూసుకుపోతుంది.

Kiara Advani: కియారా అద్వానీ బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బీ టౌన్ లో ఇప్పుడున్న క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ దూసుకుపోతుంది. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కించే ఈ యంగ్ బ్యూటీ జస్ట్ బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ లో కూడా క్రేజీ ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకొని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం కియారా సిద్దార్ధ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన షేర్షా థియేటర్లలో ఉంది.

ఆగష్టు 12న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తుండగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీగానే చేపడుతుంది. ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో కియారా ఒలంపిక్ ఇండియన్ హీరో నీరజ్ చోప్రా మీద తన ఇష్టాన్ని బయటపెట్టింది. ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రాకి సంబంధించిన ప్రస్తావన రావడంతో అతడు నిజమైన షేర్షాహ్.. దేశానికి గర్వకారణంగా నిలిచాడని సిద్దార్థ్ మల్హోత్రా కామెంట్స్ చేశాడు.

ఇక, కియారా మాట్లాడుతూ.. అతడు నేషనల్ క్రష్ మాత్రమే కాదు.. వరల్డ్ క్రష్ అని పేర్కొంది. జావెలిన్ త్రోలో ఏకచత్రాధిపత్యంగా నీరజ్ చోప్రా టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎగరేసుకు వచ్చాడన్న కియారా.. అతడి స్టయిల్, కాన్ఫిడెన్స్, పెర్ఫామెన్స్ ప్రతి ఒక్క అంశం అందరిని ఆకట్టుకుందని.. తనకైతే నీరజ్ మీద నిండా క్రష్ ఏర్పడిందని చెప్పింది.