Kichha Sudeep : గో సంరక్షణ రాయబారిగా కిచ్చా సుదీప్.. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం..
మన దేశంలో ఆవుల్ని దేవతల్లా పూజిస్తాం. ఈ నేపథ్యంలో ఆవుల్ని రక్షించడానికి పలు కార్యక్రమాల్ని కూడా చేపడతారు. గో సంరక్షకుల పేరుతో ఆవుల్ని రక్షించడానికి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం..............

Kichcha Sudeep has been appointed as the brand ambassador for the Karnataka Go conservation programme
Kichha Sudeep : మన దేశంలో ఆవుల్ని దేవతల్లా పూజిస్తాం. ఈ నేపథ్యంలో ఆవుల్ని రక్షించడానికి పలు కార్యక్రమాల్ని కూడా చేపడతారు. గో సంరక్షకుల పేరుతో ఆవుల్ని రక్షించడానికి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుంటుంది. అక్కడ గో సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. తాజాగా గో సంరక్షణ రాయబారిగా కన్నడ స్టార్ హీరో సుదీప్‌ను ఎంపిక చేసినట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ తెలిపారు.
పశుపాలనకు, గో సంరక్షణకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన పుణ్యకోటి దత్తు యోజన అనే కార్యక్రమానికి రాయబారిగా సుదీప్ ని ఎంపిక చేశారు. ఈ మేరకు సుదీప్‌కు లేఖ రాసి అభినందనలు తెలిపారు. శుక్రవారం సుదీప్ పుట్టిన రోజు కావడంతో అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వార్తని ప్రకటించారు. గో సంరక్షణ రాయబారిగా సుదీప్ రాకతో ఆ శాఖకు, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. గో రక్షకులు, సుదీప్ అభిమానులు ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.