‘కింగ్’ నాగ్ CDP లాంచ్ చేసిన సమంత అక్కినేని..

  • Published By: sekhar ,Published On : August 23, 2020 / 08:00 PM IST
‘కింగ్’ నాగ్ CDP లాంచ్ చేసిన సమంత అక్కినేని..

Updated On : August 24, 2020 / 6:35 AM IST

King Nagarjuna Birthday CDP: అక్కినేని అభిమానులు కింగ్ నాగ్ బర్త్‌డే సందడి స్టార్ట్ చేసేశారు.. ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఆదివారం(ఆగస్టు 23) సాయంత్రం నాగ్ బర్త్‌డే కామన్ డీపీని (CDP) నాగ్ కోడలు సమంత అక్కినేని లాంచ్ చేశారు.



నాగార్జున నటించిన పలు ట్రెండ్ సెట్టింగ్, బ్లాక్ బస్టర్ అండ్ సూపర్‌హిట్ సినిమాల్లోని ఫొటోలతో డిజైన్ చేసిన సీడీపీ అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు మిగతా హీరోల అభిమానులను, ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. #KingNagBirthdayCDP హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో నాగ్ బర్త్‌డే కామన్ డీపీ ట్రెండ్ అవుతోంది.NAG CDPసినిమాల విషయానికొస్తే.. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’తో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు నాగార్జున. ఈనెల 29న నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల తాలుకు విశేషాలతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.