Kingdom of the Planet of the Apes telugu teaser released
Kingdom of the Planet of the Apes : హాలీవుడ్ మూవీ యానిమల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రాలను మూవీ లవర్స్ చూసే ఉంటారు. ఈ యానిమల్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో టెలివిజన్ సిరీస్, మూవీస్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే వీటిలో రెబూటెడ్ మూవీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెబూటెడ్ సిరీస్ లో ఇప్పటికే మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
Rise of the Planet of the Apes (2011), Dawn of the Planet of the Apes (2014), War for the Planet of the Apes (2017).. ఈ మూడు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇవి తెలుగు ఆడియన్స్ ని కూడా పలకరించాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా నాలుగో సినిమా ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రం వస్తుంది. మే 24 2024లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ వైపు ఒక లుక్ వేసేయండి.
Also read : VarunLav : తాళి కడుతున్న వరుణ్.. సంతోషంలో లావణ్య..