Kiran Abbavaram : నెపోటిజం ఇండస్ట్రీలో లేదు సోషల్ మీడియాలో ఉంది.. కిరణ్ అబ్బవరం!

బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉంది అంటూ చాలా మంది ఎద్దేవా చేస్తుంటారు. తాజాగా దీనిపై యువ హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kiran Abbavaram : నెపోటిజం ఇండస్ట్రీలో లేదు సోషల్ మీడియాలో ఉంది.. కిరణ్ అబ్బవరం!

Vinaro Bhagyamu Vishnu Katha

Kiran Abbavaram : బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉంది అంటూ చాలా మంది ఎద్దేవా చేస్తుంటారు. కానీ ఇతర పరిశ్రమలతో పోల్చుకుంటే ఇక్కడే ఎంతోమంది యంగ్ హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో పైకి ఎదిగిన యువ హీరో ‘కిరణ్ అబ్బవరం’. ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

Vinaro Bhagyamu Vishnu Katha : వినరో భాగ్యము విష్ణు కథ.. వినాలన్నా, అర్ధం చేసుకోవాలన్నా కొంచెం కష్టమే..

దీంతో చిత్ర యూనిట్ ఈ మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నా గత సినిమాలు బాగోలేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సరే అవి నిజం గానే అంత లేవులే అని నేను అర్ధం చేసుకున్నాను. దీంతో చాలా జాగ్రత్తలు తీసుకోని మరి వినరో భాగ్యము విష్ణు కథ అనే ఒక మంచి సినిమాని తీసుకు వచ్చినా.. ఈసారి కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని నా మీద చాలా నెగటివిటీ తీసుకు వస్తున్నారు.

నాలాంటి చిన్న హీరోలు కూడా ఎదగాలని సోషల్ మీడియాలో మీరే పోస్ట్ లు పెడతారు. మళ్ళీ మీరే ఆ చిన్న హీరోలను ట్రోల్ చేస్తారు. నెపోటిజం ఉంది అని చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతైన అల్లు అరవింద్ గారు నాతో సినిమా చేసి నన్ను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి నెపోటిజం ఉన్నదీ ఇండస్ట్రీలో కాదు సోషల్ మీడియాలో” అంటూ తన ఆవేదనని వ్యక్తం చేశాడు. కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు కిషోర్ డైరెక్ట్ చేయగా, GA2 పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది. తమిళ భామ కశ్మీర ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.