Vinaro Bhagyamu Vishnu Katha : వినరో భాగ్యము విష్ణు కథ.. వినాలన్నా, అర్ధం చేసుకోవాలన్నా కొంచెం కష్టమే..

తాజాగా GA2 పిక్చర్స్ బ్యానర్ లో కిషోర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ' అనే మంచి సాఫ్ట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది..................

Vinaro Bhagyamu Vishnu Katha : వినరో భాగ్యము విష్ణు కథ.. వినాలన్నా, అర్ధం చేసుకోవాలన్నా కొంచెం కష్టమే..

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie Review

Vinaro Bhagyamu Vishnu Katha :  హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. SR కల్యాణమండపం సినిమా తర్వాత ఇప్పటివరకు మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. కిరణ్ గత మూడు సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. వాటిల్లో సమ్మతమే కాస్తో కూస్తే బెటర్ అనిపించింది. తాజాగా GA2 పిక్చర్స్ బ్యానర్ లో కిషోర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే మంచి సాఫ్ట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది.

తాజాగా శివరాత్రికి ఫిబ్రవరి 18న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. పెద్ద నిర్మాణ సంస్థ కావడంతో ప్రమోషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక హీరో కిరణ్ అబ్బవరం కి సినిమా ఎలా ఉన్నా ప్రమోషన్స్ మాత్రం ఓవర్ గా ఉంటాయని పేరున్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాని కూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు.

ఇక కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే అమ్మ నాన్నలు చనిపోవడంతో నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుంది, మనం మంచిగా ఉండాలి, నలుగురికి సాయం చేయాలి అనే తాతయ్య మాటలు వింటూ తిరపతిలో పెరిగిన హీరో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పనిచేస్తూ కనపడిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో యూట్యూబ్ వీడియోలకు వ్యూస్ కోసం నా పక్క నంబర్ మీదే అంటూ నైబర్ నంబర్ అని చెప్పి ఓ అమ్మాయి ఫోన్ చేసి వీడియో వ్యూస్ కోసం హీరోని కలుస్తుంది. ఇంకో పక్క నంబర్ మురళీశర్మ, హీరో, హీరోయిన్ కలిసి మొదటి హాఫ్ అంతా కామెడీ, పాటలు సాగదీస్తారు. ఇదంతా ఆ అమ్మాయి యూట్యూబ్ వీడియో వ్యూస్ కోసం చేయడం విశేషం. అలాంటి సమయంలో హీరోయిన్ మురళి శర్మని చంపడం, జైలుకి వెళ్లడం, మధ్యలో ఓ రాజకీయ నేత రావడం, అసలు హీరోయిన్ ఎందుకు చంపింది ? హీరోయిన్ ని ఎలా బయటకి తీసుకొచ్చాడు హీరో? అనే కథతో పాటు మధ్యలో ఉగ్రవాదం, NIA అంటూ ఎందుకు వచ్చింది? దానికి, హీరోకి సంబంధం ఏంటి అనేది తెరపైనే చూడాల్సింది.

ఫోన్లు వచ్చిన కొత్తల్లోనే చాలా మంది ట్రై చేసిన నంబర్ నైబర్ అనే పాత కాన్సెప్ట్ ని తీసుకొని కొత్త కాన్సెప్ట్ అంటూ ప్రమోట్ చేశారు సినిమాని. మొదటి హాఫ్ అంతా ఒక అమ్మాయి యూట్యూబ్ వీడియో వ్యూస్ కోసం సాగదీయడం హాస్యాస్పదంగా ఉంటుంది. కాకపోతే ఇదంతా ఎంటర్టైన్మెంట్ గా ఇవ్వడానికి ట్రై చేసాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ పెద్దగా బోర్ కొట్టదు. ఇక సెకండ్ హాఫ్ లో చాలా లాజిక్ లేని సీన్స్ ఉంటాయి. రెండు, మూడు కథలు మిక్స్ అవుతూ ఏ కథ ఎందుకు సడెన్ గా వచ్చిందో అర్ధం కాక సెకండ్ హాఫ్ చాలా వరకు గజిబిజిగా సాగుతుంది. ఇక ఇటీవల సోషల్ మీడియాతో ఏదైనా చేసేయొచ్చు, క్షణాల్లో అన్నీ వైరల్ అయిపోతాయి అని చాలా సినిమాల్లో చూపించినట్టే ఇందులో కూడా చూపిస్తారు. ఒక ప్రఖ్యాత ఆర్గనైజేషన్ NIA ని ఇటీవల చాలా సినిమాలో తెగ వాడేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఏదో చాలా సింపుల్ గా వాడేశారు. సినిమా చూస్తున్నప్పుడు, చూశాక కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి సినిమా చూసేటప్పుడు, కానీ వాటికి సమాధానం మాత్రం ఉండదు ఇందులో. సినిమా ప్రేమికులకే అర్ధం చేసుకోవడానికి ట్రై చేసినా కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి, ఇంక సాధారణ ప్రేక్షకుడికి అంత తొందరగా అర్ధం అవ్వదు సినిమా. ఇక చివర్లో ఏం చెప్పాలో క్లైమాక్స్ తెలీక సెకండ్ హాఫ్ కి లీడ్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే వినరో భాగ్యము విష్ణుకథ వినాలన్నా, అర్ధం చేసుకోవాలన్నా కొంచెం కష్టమే.

Chiranjeevi : క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అని నమ్మకం ఇచ్చారు.. యుంగ్ డైరెక్టర్స్ ఆయన్ని చూసి నేర్చుకోవాలి..

ఇక టైటిల్ కి కథకి జస్టిఫికేషన్ అని అడిగితే హీరో పేరు విష్ణు, అతని కథ చెప్తాడు కాబట్టి విష్ణు కథ అని ఈ టైటిల్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇక కథ చాలా వరకు తిరుపతిలోనే జరిగినట్టు చూపిస్తారు. టైటిల్ ఇలా పెట్టారు కాబట్టి తిరుపతి బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ కథ ఎక్కడైనా తీసుకోవచ్చు, కాకపోతే ప్రమోషన్స్ కి ఉపయోగపడుతుంది, కొత్తగా ఉంటుందని తిరుపతిలో తీసినట్టు ఉన్నారు. ఇక పెద్ద సంస్థ నుంచి సినిమా రావడం, ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడం, వీకెండ్ కావడంతో సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు సినిమాకి 2.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఓవరాల్ గా ఈ హీరోకి సినిమా గత సినిమాల్లా కాకపోయినా కాసేపు జనాల్ని నవ్వించాడు కాబట్టి యావరేజ్ సినిమాలాగా మిగులుతుంది. సెకండ్ హాఫ్ లీడ్ ఇచ్చినా ఈ సినిమాకి పార్ట్ 2 తీస్తారని నమ్మకం ఆ డైరెక్టర్ కి కూడా ఉందో లేదో.