Kiran Abbavaram Neha Shetty Rules Ranjann Movie Trailer Released
Rules Ranjann Trailer : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) సినిమాతో సెప్టెంబర్ 28న రాబోతున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయిక. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సమ్మోహనుడా అనే నేహశెట్టి సాంగ్ బాగా వైరల్ అయింది. తాజాగా రూల్స్ రంజన్ సినిమా ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ లోనే కామెడీ, క్లాస్, మాస్ చూపించేసాడు కిరణ్ అబ్బవరం. ఇక సినిమాలో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడో చూడాలి.