Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం లవ్ స్టోరీ తెలుసా? ప్రపోజ్ చేసుకోకుండా ప్రేమించుకొని.. ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా చేసుకోవాలని..

తాజాగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.

Kiran Abbavaram : యువ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్(Rahasya Gorak) ని ప్రేమించి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సంవత్సరమే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.

ఇంటర్వ్యూలో మీ లవ్ స్టోరీ ఎందుకు ఇన్నాళ్లు దాచారు, ఎలా మొదలైంది, మీ ప్రేమ కథ గురించి చెప్పమని అడగడంతో కిరణ్ అబ్బవరం సమాధానమిస్తూ.. అయిదేళ్ల రిలేషన్ మాది. రాజావారు రాణిగారు సినిమా చేస్తున్నప్పుడే ఆ సెట్స్ లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఒకరికొకరు నచ్చాము. ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చాయి. అప్పట్నుంచి అనుకుంటున్నాము కాని ఇద్దరం సంవత్సరంన్నర వరకు ప్రపోజ్ చేసుకోలేదు. ఆ తర్వాతే ఐ లవ్ యు చెప్పుకున్నాము అని తెలిపాడు.

Also Read : Chiranjeevi : తేజ సజ్జపై మెగాస్టార్ ప్రశంసలు.. నా కలని అతను చేసేశాడు..

అలాగే.. నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు బయటకి చెప్పను. నా ఫ్యామిలీ గురించి కూడా ఎవరికీ ఎక్కువగా తెలీదు. నా రిలేషన్ ని కూడా అలాగే మెయింటైన్ చేశాను. నిశ్చితార్థం కూడా సీక్రెట్ గానే చేసుకోవాలనుకున్నాను కాని కుదరలేదు. అందుకే ఇప్పుడు అందరికి తెలిసింది అని తెలిపాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం చివరగా రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం కిరణ్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు