Chiranjeevi : తేజ సజ్జపై మెగాస్టార్ ప్రశంసలు.. నా కలని అతను చేసేశాడు..
తాజాగా మరోసారి చిరంజీవి హనుమాన్, తేజ సజ్జ గురించి మాట్లాడారు.

Megastar Chiranjeevi Appreciated Teja Sajja and Hanuman
Chiranjeevi : తేజ సజ్జ(Teja Sjja) ఇటీవల హనుమాన్(Hanuman) సినిమాతో వచ్చి పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొట్టి 300 కోట్ల కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా హనుమాన్ సినిమాపై, తేజ సజ్జపై గతంలో ప్రశంసలు కురిపించారు. తాజాగా మరోసారి చిరంజీవి హనుమాన్, తేజ సజ్జ గురించి మాట్లాడారు.
ఇటీవల ఆహా(Aha) ఓటీటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ చేయగా దానికి సంబంధించిన వీడియో కంటెంట్ ని తాజాగా విడుదల చేసింది. ఈ ఈవెంట్లో చిరంజీవి తేజసజ్జపై తన కలని నెరవేర్చడంటూ ప్రశంసలు కురిపించారు. చిరంజీవితో స్టేజిపై ముఖాముఖి చర్చించగా యాంకర్.. ఎవర్ని డ్రీం రోల్ అడిగినా మీ సినిమా పేరు చెప్తారు. మీకు ఏదైనా డ్రీం సినిమా, లేదా రోల్ ఉందా అని అడిగారు.
దీనికి చిరంజీవి సమాధానమిస్తూ.. దీనికి సమాధానం చెప్పేముందు మీకో విషయం చెప్పాలి అని తేజ సజ్జని చూపిస్తూ.. అక్కడ కూర్చున్న వ్యక్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాతోనే కెరీర్ మొదలుపెట్టాడు 25 ఏళ్ళ క్రితం. ఆ తర్వాత నా ఇంద్ర సినిమాలో కూడా నటించాడు. చిన్నప్పట్నుంచి నన్ను చూస్తూ పెరిగాడు. నా సినిమాల్లో నటించాడు. నన్ను ప్రేరణగా తీసుకొని ఎదిగాడు. ఇటీవల హనుమాన్ సినిమా తీసి దేశమంతా మెప్పు పొందాడు. నేను కూడా ఒకప్పుడు హనుమాన్ సినిమా చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను. కాని అతను చేసిన హనుమాన్ సినిమా చూసి నేను పూర్తిగా సంతృప్తి చెందాను. అతను కూడా నా ప్రయాణంలో భాగమే అంటూ తేజ సజ్జపై ప్రశంసలు కురిపంచడంతో తేజ ఆనందంతో ధన్యవాదాలు తెలిపాడు.
Padma Vibhushan, Mega ? @KChiruTweets lauds @tejasajja123 for his impressive journey in cinema at #SIFF ?
He stated Teja is part of his journey & expressed joy in seeing his man, #TejaSajja playing the lead in this epic superhero film❤️? pic.twitter.com/M7bp4dJyTl
— ??????????? (@UrsVamsiShekar) April 12, 2024
అసలు మాటల్లో తేజ సజ్జ ప్రస్తావన రాకపోయినా అతన్ని, తను చేసిన హనుమాన్ సినిమాని గుర్తుంచుకొని తన కల అని చెప్పి ప్రశంసలు కురిపించడంతో మెగాస్టార్ ని కూడా అభినందిస్తున్నారు.