All We Imagine as Light : 30 ఏళ్ళ తర్వాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ మెయిన్ విభాగం కాంపిటేషన్‌లో.. లేడీ డైరెక్టర్ తీసిన ఇండియన్ సినిమా..
ఈ సంవత్సరం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెయిన్ విభాగమైన పామ్ డ ఓర్ అవార్డు కేటగిరిలో ఇండియన్ సినిమా పోటీకి నిలిచింది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ విభాగంలో ఇండియన్ సినిమా పోటీ పడుతుంది.

after 30 years indian movie All We Imagine as Light competing in Cannes Film Festival Main Category
All We Imagine as Light : ఫ్రాన్స్(France) లో జరిగే ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) కి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు, ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఇండియా నుంచి పలు సినిమాలు వివిధ విభాగాల్లో అక్కడ స్ట్రీమింగ్ చేస్తారు. అనేకమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొని అక్కడి రెడ్ కార్పెట్ పై నడుస్తారు.
ఈ సంవత్సరం 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 15 నుంచి జరగనుంది. ఈ సంవత్సరం కూడా పలువురు ఇండియన్ సినీ పరిశ్రమ నుంచి హాజరు కానున్నారు. అయితే ఈ సంవత్సరం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెయిన్ విభాగమైన పామ్ డ ఓర్ అవార్డు కేటగిరిలో ఇండియన్ సినిమా పోటీకి నిలిచింది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ విభాగంలో ఇండియన్ సినిమా పోటీ పడుతుంది.
ఈ 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ దర్శకురాలు తెరకెక్కించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ అనే సినిమా కాన్స్ లో ప్రధాన విభాగమైన పామ్ డ ఓర్ అవార్డు కేటగిరిలో మరో 20 సినిమాలతో పోటీ పడుతుంది. గతంలో 30 ఏళ్ళ క్రితం 1994లో షాజీ కరణ్ తెరకెక్కించిన స్వహం అనే సినిమా ఈ కేటగిరిలో పోటీలో నిలిచింది. మళ్ళీ అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండియా నుంచి ఏ సినిమా ఈ కేటగిరిలో పోటీకి వెళ్ళలేదు. మరి ఈ సారి అవార్డు గెలుస్తారా లేదా చూడాలి.
ALL WE IMAGINE AS LIGHT – Payal KAPADIA#Competition #Cannes2024
— Festival de Cannes (@Festival_Cannes) April 11, 2024
#PayalKapadia’s #AllWeImagineAsLight is the first Indian film in 30 years to make it to Cannes’ competition section for Palme d'Or [Golden Palm] award.
The last Indian film to make it to this coveted section was Shaji N Karun’s #Swaham in 1994.#Cannes2024 pic.twitter.com/S9OE806ob9
— Gulte (@GulteOfficial) April 12, 2024