Kiran Rathod will enter in Bigg Boss 7 Telugu Rumors goes Viral
Kiran Rathod : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7) త్వరలో రానుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేసి ఆడియన్స్ కి షోపై మరింత ఆసక్తి పెంచారు. బిగ్‌బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి మొదలవ్వనుంది. దీంతో షో అభిమానులు ఆసక్తిగా ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సారి కూడా నాగార్జుననే(Nagarjuna) హోస్ట్ చేయనున్నారు.
అధికారికంగా తెలియకపోయినా బిగ్‌బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్… అమరదీప్ – తేజస్విని జంట, ఢీ పండు, ఆట సందీప్, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, ఓ సీరియల్ నటి, సురేఖ వాణి, సుప్రీతా, జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. ఇలా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా బిగ్ బాస్ లోకి మరో హాట్ యాక్ట్రెస్ పేరు వినిపిస్తుంది. హాట్ యాక్ట్రెస్ కిరణ్ రాథోడ్ ని బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజస్థానీ భామ కిరణ్ రాథోడ్ తెలుగులో నువ్వు లేక నేను లేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి తెలుగు, తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం సాంగ్స్ లో, కొన్ని బోల్డ్ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. చివరిసారిగా తెలుగులో 2013లో వచ్చిన కెవ్వు కేక సినిమాలో కనిపించింది. 2016 లో తమిళ్ లో చివరి సినిమా చేయగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
Ram Charan : RC16 అప్డేట్.. చరణ్ సినిమా ఆఫీస్ కోసం వచ్చిన సుకుమార్..
బిగ్ బాస్ షోలో కొంచెం అందం కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే కిరణ్ రాథోడ్ ని షోకి తీసుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి షోలోకి ఎవరెవరు వస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.