Ram Charan : RC16 అప్డేట్.. చరణ్ సినిమా ఆఫీస్ కోసం వచ్చిన సుకుమార్..
శంకర్ సినిమా ఎప్పుడవుతుంది, RC16 ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానులకు చిత్రయూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది.

Ram Charan Buchi Babu Sana movie RC 16 New Office Opened Sukumar special appearance
RC 16 New Office : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీని అనౌన్స్ చేశారు. RC16 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అనౌన్స్‌మెంట్ తోనే ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా గురించి బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. నాలుగేళ్లు కష్టపడి రాశాను ఈ స్క్రిప్ట్. చరణ్ ని అంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు అని చెప్పి సినిమాపై భారీ అంచనాలు పెంచాడు. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం.
Mokshagna : భగవంత్ కేసరి సెట్స్ లో మోక్షజ్ఞ.. ఫొటోలు..
శంకర్ సినిమా ఎప్పుడవుతుంది, RC16 ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానులకు చిత్రయూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. RC16 వర్క్ మొదలైందని, ఈ సినిమా కోసం కొత్త ఆఫీస్ తీశామని, పూజా కార్యక్రమాలతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశామని చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాకి సుకుమార్ కూడా సహా నిర్మాతగా ఉండటంతో సుకుమార్ RC16 ఆఫీస్ ఓపెనింగ్ కి వచ్చారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక అభిమానులు త్వరగా వర్క్ మొదలుపెట్టి సినిమా షూట్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు.