Kishkindhapuri Sequel
Kishkindhapuri Sequel : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా కిష్కింధపురి నేడు రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కథనంలో కొన్ని లోపాలు ఉన్నా కొత్త కథతో భయపెడుతూ బాగానే థ్రిల్ ఇచ్చారు ప్రేక్షకులకు. క్లైమాక్స్ అయ్యాక కిష్కింధపురి సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. సినిమా అంతా అయ్యాక క్లైమాక్స్ తర్వాత సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన సీన్ చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.(Kishkindhapuri Sequel)
దీంతో కిష్కింధపురి సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సీక్వెల్ లో ఒకప్పటి హీరోయిన్ చుట్టే ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రేమ. కిష్కింధపురి సినిమాలో ప్రేమ దయ్యంగా మారిన వ్యక్తి తల్లి పాత్రలో కాసేపు కనిపించి సింపుల్ ఎమోషనల్ పాత్రలో మెప్పించింది. కానీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కి నెక్స్ట్ సీక్వెల్ లో ఆ తల్లి పాత్రతోనే కథ నడుస్తుందని అర్ధమవుతుంది.
Also Read : Nainika : మా నాన్న మంచోడు కాదు.. వెళ్ళిపోమన్నాను.. అమ్మని టార్చర్ పెట్టారు.. బిగ్ బాస్ నైనిక కామెంట్స్..
దీంతో నెక్స్ట్ కిష్కింధపురి సీక్వెల్ లో కూడా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా, ప్రేమ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. మరి సీక్వెల్ ఇంకెంత హారర్ గా తెరకెక్కిస్తారో, ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి. ఒకప్పుడు తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రేమ ఇప్పుడు అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ పలు టీవీ షోలలో కనిపిస్తుంది.