SS Chakravarthy : సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

సినీ పరిశ్రమలోని సీనియర్ నటులు మరియు టెక్నీషియన్స్ స్వర్గస్తులు అవుతూ ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత..

Kollywood producer SS Chakravarthy passed away

SS Chakravarthy : సౌత్ సినీ పరిశ్రమలోని సీనియర్ నటులు మరియు టెక్నీషియన్స్ స్వర్గస్తులు అవుతూ ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఇటీవలే మలయాళ స్టార్ కమెడియన్ మముక్కోయ (Mamukkoya) మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోయి, రెండు రోజులు ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచారు. తాజాగా తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. కోలీవుడ్ లో బడా నిర్మాతగా ఎదిగిన ఎస్ ఎస్ చక్రవర్తి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Gopichand : హీరోయిన్ కోసం దర్శకుడిని కాదన్న గోపీచంద్.. ఇంటర్వ్యూలో నిలదీసిన దర్శకుడు..

గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న చక్రవర్తి చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మరణ వార్త విని తమిళ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. చక్రవర్తి 1997 లో ‘రాశి’ అనే చిత్రంతో నిర్మాతగా కోలీవుడ్‌ పరిశ్రకు పరిచయం అయ్యారు. నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలు అందించిన చక్రవర్తి హీరో అజిత్‌తో (Ajith Kumar) ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు. ఆంజనేయ, సిటిజెన్, మగవారే, వాలి, రెడ్ చిత్రాలను అజిత్ హీరోగా నిర్మించారు.

Mamukkoya : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..

శింబుతో (Simbu) కాలై, వాలు వంటి సూపర్ హిట్ సినిమాలను కూడా నిర్మించారు. కాగా చక్రవర్తికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు హీరోగా తెరగేంట్రం కూడా చేశాడు. జాని రేణిగుంట అనే సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ కి హీరోగా పరిచయం అయ్యాడు.