Ajith Kumar : ఫ్రెండ్స్ కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్న అజిత్ కుమార్.. వైరల్ అవుతున్న వీడియో..

ఫ్రెండ్స్ కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్న అజిత్ కుమార్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Kollywood star hero Ajith Kumar biriyani cooking for his friends video viral

Ajith Kumar : టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. కానీ ఆయనకి సంబంధించిన విషయాలను ఎవరైనా పోస్టు చేస్తే మాత్రం అవి వైరల్ అవుతూ ట్రెండ్ లిస్టులో నిలుస్తాయి. తాజాగా ఈ హీరో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అజిత్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమని అందరికి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా బైక్ టూర్స్ వేస్తూ వస్తుంటారు.

తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఫారెస్ట్ రైడింగ్ కి వెళ్లారు. అక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడమే కాదు, డిన్నర్ టైములో తన స్నేహితుల కోసం అదిరిపోయే బిర్యానీ ప్రిపేర్ చేశారు. అజిత్ బిర్యానీ చేస్తుంటే.. పక్కన ఫ్రెండ్స్ ఆ సువాసనతోనే కడుపు నింపుకుంటున్నారు. ఫైనల్లీ అజిత్ ప్రిపేర్ చేసిన బిర్యానీ చూస్తుంటే.. నెటిజెన్స్ కి కూడా నోరు ఊరుతుంది. మరి ఆ కుకింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Also read : Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా.. రాబోయే సినిమా బహుమతులు ఇవే..

కాగా అజిత్ ప్రస్తుతం ‘విడ ముయిర్చి’ సినిమాలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లబోతుందట. ‘అజర్‌బైజాన్‌’లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి మూవీ టీం సిద్దమవుతుందట. ఇక ఈ షూటింగ్ కి వెళ్లేముందు అజిత్.. ఫ్రెండ్స్ తో ఇలా ఛిల్ల్ అవుతున్నారు.