Vaishnav, Krish Movie: దసరాకు థియేటర్లలోకి రాబోతున్న కొండపొలం
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది.

Konda Polam
Krish Movie: క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శకనిర్మాతలు. అక్టోబరు 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తుండగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణనంతరం పనులు జరుగుతుండగా.. నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుకు కొండపాలెం, జంగిల్ బుక్ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు చిత్ర వర్గాల్లో టాక్. తొలుత ఈ సినిమాని డిజిటల్ ప్లాట్ ఫాంలోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చినా.. థియేటర్లలోనే సినిమాను విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.