Kondaveeti Simham : ఇండస్ట్రీ రికార్డ్.. 40 ఏళ్ల ‘కొండవీటి సింహం’

నేటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నటరత్న ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’..

Kondaveeti Simham 40 Years

Kondaveeti Simham: నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుల కలయికలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘కొండవీటి సింహం’.. 1981 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం నేటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

ఎన్టీఆర్.. ఎస్పీ రంజిత్ కుమార్, రాముగా ద్విపాత్రాభినయం చేశారు. ఎస్పీ రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకి జోడీగా శ్రీదేవి నటించారు. రోజా మూవీస్ బ్యానర్ మీద ఎమ్.అర్జున రాజు, కె.శివరామ రాజు నిర్మించారు.

అవినీతిని అంతం చెయ్యడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే పోలీసు పాత్రలో నటరత్న నటన అమోఘం. చక్రవర్తి స్వరపరచిన 7 పాటలు ఎవర్ గ్రీన్. కె.ఎస్. ప్రకాష్ కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన ‘కొండవీటి సింహం’ ఎన్టీఆర్, కె.రాఘవేంద్ర రావుల కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది.

Prabhas 25 : క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో సందీప్ ‘స్పిరిట్’..

ఈ సినిమాను 47 ప్రింట్లతో 43 కేంద్రాల్లో రిలీజ్ చెయ్యగా.. అన్ని కేంద్రాల్లోనూ 70 రోజులు ఆడడం విశేషం. అలాగే 37 కేంద్రాల్లో 100 రోజులు, ఏకంగా 15 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. లేట్ రన్‌లోనూ దాదాపు 200 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం, 15 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. వైజాగ్‌లో షిఫ్టులతో 315 రోజులు ప్రదర్శించబడింది.

ఇండస్ట్రీ రికార్డ్..

నటరత్న కలెక్షన్ల పరంగానూ కాలంతో పోటీపడ్డారు. ‘అడవి రాముడు’ 50 రోజులకు 81 లక్షలతో రికార్డ్.. ‘వేటగాడు’ 50 రోజులకు 96 లక్షలతో రికార్డ్.. ‘కొండవీటి సింహం’ 50 రోజులకు 1.21 కోట్లతో సరికొత్త రికార్డ్.. అప్పటికి ఇదే ఇండస్ట్రీ రికార్డ్.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లేముందు వరుసగా సాధించిన బ్లాక్‌బస్టర్ సినిమాలు.. రికార్డులు ఇవి.. 1977 నుంచి 1982 వరకు ఆరేళ్ల పాటు ఎప్పటికప్పుడు తన సినీ రికార్డులను తానే బద్దలు కొట్టారు ఎన్టీఆర్..

SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..