×
Ad

Koragajja : రీల్స్ చేయండి.. ఏకంగా కోటి రూపాయల వరకు బహుమతులు గెలుచుకోండి.. కన్నడ సినిమా క్రేజీ ఆఫర్..

కొరగజ్జ తమ సినిమా సాంగ్స్ కి రీల్స్ చేసి ఏకంగా కోటి రూపాయల వరకు బహుమతులు గెలుచుకోవచ్చని ప్రకటించింది.(Koragajja)

Koragajja

Koragajja : ఇటీవల సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కొరగజ్జ తమ సినిమా సాంగ్స్ కి రీల్స్ చేసి ఏకంగా కోటి రూపాయల వరకు బహుమతులు గెలుచుకోవచ్చని ప్రకటించింది.(Koragajja)

కబీర్ బేడి, సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, భవ్య, శ్రుతి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కొరగజ్జ. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కన్నడలో తెరకెక్కుతుండగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు.

Also Read : Mana Shankara VaraPrasad Garu : చిరంజీవి – వెంకటేష్ ఒకే స్టేజిపై.. మన శంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు?

కర్ణాటక, కేరళలోని కరావళి ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో ఈ కొరగజ్జ దేవతను పూజిస్తారు. ఈ కథ అంతా కొరగజ్జ దేవత చుట్టే తిరుగుతుంది. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో కొరగజ్జ మూవీ సాంగ్స్ ప్రీమియర్ ఈవెంట్ కర్ణాటకలో నిర్వహించారు. శ్రేయ ఘోషల్, అర్మాన్ మాలిక్ ఆలపించిన AI-పవర్డ్ ట్రాక్ గాలి గంధ తో పాటు మిగిలిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కొరగజ్జ సినిమా పాటలతో క్రియేటివ్ రీల్స్ చేసి @sudheer.attavar @vidyabejai @trivikramsapalya అకౌంట్స్ కి ట్యాగ్ చేస్తే ఎక్కువ వ్యూస్, లైక్స్, కామెంట్స్ సాధించిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొత్తం ఒక కోటి విలువైన బహుమతులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు మూవీ యూనిట్. అలాగే జిల్లా స్థాయిలో ప్రత్యేక గిఫ్ట్స్ కూడా ఇవ్వనున్నారట. ఇంకెందుకు ఆలస్యం రీల్స్ చేసే వాళ్ళు ఈ ఆఫర్ ని అందుకోండి.

Also Read : Anasuya Bharadwaj : తప్పు అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పిన అనసూయ.. పోస్ట్ వైరల్..