Mana Shankara VaraPrasad Garu : చిరంజీవి – వెంకటేష్ ఒకే స్టేజిపై.. మన శంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు?

మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. (Mana Shankara VaraPrasad Garu)

Mana Shankara VaraPrasad Garu : చిరంజీవి – వెంకటేష్ ఒకే స్టేజిపై.. మన శంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు?

Mana Shankara VaraPrasad Garu

Updated On : January 5, 2026 / 5:40 PM IST

Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కూడా గెస్ట్ రోల్ చేస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది.(Mana Shankara VaraPrasad Garu)

మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7న హైదరాబాద్ లో జరగనుందని అధికారికంగా ప్రకటించారు.

Also Read : Divyabharathi : ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన హీరోయిన్.. దివ్యభారతి ఫొటోలు..

చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ ఈ ఈవెంట్ కి వచ్చి సందడి చేయనున్నారు. అలాగే నయనతార కూడా రానుంది. ఇక మన శంకర వరప్రసాద్ మూవీ టీమ్ అంతా హాజరు కానున్నారు. అయితే ఈ ఈవెంట్ ని భారీగా జనాల మధ్య కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లేదా ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ లో ఘనంగా చేయనున్నట్టు సమాచారం. మరి ఆ సమయానికి ఈవెంట్ ని ఏ రేంజ్ లో చేస్తారో చూడాలి.

చిరంజీవి – వెంకటేష్ మరోసారి కలిసి స్టేజిపై కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Anasuya Bharadwaj : తప్పు అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పిన అనసూయ.. పోస్ట్ వైరల్..