Koratala Siva – Chiranjeevi : నాకు చిరంజీవికి ఎలాంటి విబేధాలు లేవు.. ఆయనే నాకు మెసేజ్ పెట్టి..

తాజాగా కొరటాల శివ దేవర ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవికి - తనకు విబేధాలు ఉన్నాయనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

Koratala Siva Gives Clarity About Issues with Chiranjeevi after Acharya

Koratala Siva – Chiranjeevi : ఎన్టీఆర్ దేవర సినిమాతో కొరటాల శివ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో కొరటాల శివ చిరంజీవి, రామ్ చరణ్ లతో ఆచార్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో చిరుకి – కొరటాల శివకు విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. చిరంజీవి కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కొరటాల శివని ఉద్దేశించినవే అని అనుకున్నారు.

ఆచార్య ఫ్లాప్ అయిన దగ్గర్నుంచి ఈ వివాదం సాగుతుంది. ఇటీవల కొరటాల శివ కూడా ఓ ఇంటర్వ్యూలో ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, పక్కనోళ్ళ పనిలో వేలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది అని సాధారణంగా చేసిన వ్యాఖ్యలని కొంతమంది నెటిజన్లు చిరంజీవికి ఆపాదించి అన్నారని ప్రచారం చేసారు. తాజాగా కొరటాల శివ దేవర ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవికి – తనకు విబేధాలు ఉన్నాయనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

Also Read : Pawan kalyan : తిరుప‌తి ల‌డ్డూ వివాదం.. హీరో కార్తీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

కొరటాల శివ మాట్లాడుతూ.. నాకు, చిరంజీవి గారికి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఆయనే నాకు మెసేజ్ చేసి నువ్వు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఈసారి గట్టిగా కొట్టాలి శివ అని చెప్పారు. బయట అనవసరంగా కొందరు అలా అనుకుంటున్నారు అంతే. మా ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంది అని అన్నారు. అలాగే ఆచార్య రిలీజ్ అయిన మూడు రోజులకే నేను దేవర సినిమాతో బిజీ అయిపోయాను అని అన్నారు.

దీంతో చిరంజీవికి – కొరటాల శివకు ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చేసారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో కొరటాల శివ పేరు వాడుకొని చిరంజీవిని ట్రోల్ చేసే వాళ్ళు అలాంటి ట్రోల్స్ ఆపుతారేమో చూడాలి.