Kotta Cinema : ‘కొత్త సినిమా’ నుంచి.. ‘మేము కూడా సినిమా తీసినామురో..’సాంగ్ రిలీజ్..
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఈ సాంగ్ ని రాసి కంపోజ్ చేసి పాడారు. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి.. (Kotta Cinema)
Kotta Cinema
Kotta Cinema : సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో కొత్తవాళ్లతో తెరకెక్కుతున్న సినిమా ‘కొత్త సినిమా’. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాణంలో అజర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రామగుండం, గోదావరిఖని, సింగరేణి బ్యాక్ డ్రాప్ లో అక్కడ లోకల్ వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో..’ అనే పాటను రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు RK సాగర్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఈ సాంగ్ ని రాసి కంపోజ్ చేసి పాడారు. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి..
Also Read : Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్లో షాకింగ్ ఘటన.. విషపురుగు కాటు.. ఐసీయూలో నటుడు!
నిర్మాతలు వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. టైటిల్ కు తగ్గట్టే మా సినిమా కొత్తగా ఉంటుంది. అజర్ ఈ సినిమాతో వందమంది కొత్త వాళ్లను పరిచయం చేయడం అభినందనీయం. ఆయన కలకు సహకరించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మా సినిమాను సరికొత్త కంటెంట్ తో లోకల్ టాలెంట్ తో అజర్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. త్వరలోనే రిలీజ్ చేస్తాం అని అన్నారు. ఈ సాంగ్ లిరిక్ రైటర్, కంపోజర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. అజర్ వచ్చి ఈ సినిమాకు ప్రమోషనల్ సాంగ్ చేయమని అడిగాడు. నా సంగీతం అజర్ వాళ్ల నాన్నకు నచ్చి నా పేరు సజెస్ట్ చేశాడట. గోదావరిఖని దాకా నా మ్యూజిక్ వెళ్లింది అనే సంతోషంతో ఈ పాట చేశాను. హైదరాబాద్ వచ్చి తమ సినిమా కలను నెరవేర్చుకోలేని ఎంతోమంది ఔత్సాహికుల ఆవేదన ఈ పాటలో ఉంటుంది అని తెలిపారు.
డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ.. అందరూ కింద స్థాయి నుంచి వచ్చామని అంటారు. మేము ఇంకా కింద స్థాయి, భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. ఎందరో గొప్ప తెలుగు దర్శకులు సినిమాను మన దగ్గరకు చేర్చారు. నేను ఈ సినిమాను మరింత దగ్గరగా తీసుకెళ్లాలని అనుకున్నా. పట్నంలోనే ఉంటదా కళామతల్లి, జర వెతికి చూడు ఉంటుంది గల్లీ గల్లీ అని ఈ పాటలో చెప్పినట్లు సినిమాను లోకల్ లో తీసి వందమంది కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నా అని తెలిపారు. నటుడు RK సాగర్ మాట్లాడుతూ.. అజర్ తో నేను మాట్లాడినప్పుడుల్లా ఈ మూవీ గురించి అడిగేవాడిని. హుస్సేన్ గారు ఈ సినిమా కోసం తను సింగరేణి ఎంప్లాయిగా పడిన 40 ఏళ్ల కష్టాన్ని ఫణంగా పెట్టారు. ఆయన పీఎఫ్ డబ్బులను ఈ మూవీ నిర్మాణానికి ఉపయోగించారు అని అన్నారు.

ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సినిమా నేను చూశాను. ఈ సినిమా నిజంగానే కొత్తగా తీశారు. ఫిలిం మేకింగ్ లో అజర్ అన్ని రూల్స్ బ్రేక్ చేశాడు. ఆర్జీవీ అన్నట్లు మేడిన్ కరీంనగర్ కాదు మేడిన్ గోదావరిఖని అని ప్రూవ్ చేశాడు అని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మా ప్రాంతం నుంచి సినిమా నిర్మించి నష్టపోయినవారున్నారు. అందుకే ప్రొడక్షన్ వద్దు అని చెప్పా. కానీ కొడుకు అజర్ కలను తీర్చడం కోసం తండ్రి హుస్సేన్, ఇతర కుటుంబ సభ్యులు త్యాగం చేశారు. మా ఏరియాలో చాలా మంది నటులున్నారు. దర్శకనిర్మాతలు వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం తరుపున స్థానిక ఫిలింమేకర్స్ కు అందాల్సిన సాయాన్ని, సహకారాన్ని అందిస్తాం అని తెలిపారు.
