DSP Bheem Reddy: బినామీల పేరుతో కోట్ల రూపాయల దందా.. డీఎస్పీ భీంరెడ్డి రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
ఆదాయానికి మించి ఆస్తులు కేసులో అరెస్టయిన డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి (DSP Bheem Reddy)రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు.
ACB Department revealed startling facts in the remand report of DSP Bhimreddy
- డీఎస్పీ భీంరెడ్డి అక్రమాస్తులు లభ్యం
- రూ.200 కోట్ల బినామీ ఆస్తులు
- చంచల్గూడ జైలుకు ఏసీబీ తరలింపు
DSP Bheem Reddy: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి (DSP Bheem Reddy)రిమాండ్ రిపోర్టులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. భీంరెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఏకకాలంలో 15 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో అక్రమాస్తులు వెలుగుచూశాయి. ఆయన ఇంట్లో లభించిన రెండు కీలకమైన మెమరీ కార్డులతో పాటు భారీగా ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. ఈ 9 రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఏసీబీ అంచనాల ప్రకారం.. డీఎస్పీ భీంరెడ్డి అక్రమాస్తుల అసలు విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చట్టపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఆయన అత్యంత తెలివిగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. ఆస్తులను కూడబెట్టే క్రమంలో మొదట తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లను రద్దు (క్యాన్సిలేషన్ డీడ్) చేశాడు. ఆ వెంటనే వాటిని తన బినామీల పేరిట మార్చి, తెరవెనుక నుండి తానే సర్వహక్కులు అనుభవించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ భారీ అవినీతి తిమింగలానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, అధికారులు ఆయన్ను చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ మెమరీ కార్డుల్లో ఉన్న సమాచారం ఆధారంగా భీంరెడ్డికి సహకరించిన బినామీలు, ఇతర ప్రభుత్వ అధికారుల వివరాలను సేకరించే పనిలో ఏసీబీ నిమగ్నమైంది. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
