King 100 : నాగ్‌తో టబు ఘర్షణ..?
అక్కినేని నాగార్జున 100వ చిత్రం 'కింగ్ 100' (King 100) షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది.
Tabu special role in Akkineni Nagarjuna King 100 movie
King 100 : వెండితెరపై కింగ్ నాగార్జున, హీరోయిన్ టబు రొమాంటిక్ మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో నాగ్, టబు వెండితెరపై కురిపించిన మ్యాజిక్ ఇప్పటికీ ఆడియన్స్ మైమరిచిపోనివ్వదు. ఆ తర్వాత ఆవిడా మా ఆవిడే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఆతరువాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై కలిసి కనిపించలేదు.
దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ మోస్ట్ బ్యూటిఫుల్ జోడీ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. అయితే ఈసారి వారు పాత రొమాంటిక్ స్టైల్లో కాకుండా శత్రువులుగా కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది. అక్కినేని నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’ షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లో నాగార్జున, టబు కలిసి నటించబోతున్నారు. ఈ మూవీలో టబు కేవలం ఒక సాధారణ పాత్రలో కాకుండా, పవర్ఫుల్ నెగెటివ్ రోల్లో నటించబోతోందట.
Colours Swathi : రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. తన సినిమా దర్శకుడినే..
టబుకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో బాలీవుడ్లో ‘మక్బూల్’, ‘హైదర్’, ‘ఫితూర్’ వంటి చిత్రాల్లో క్లిష్టమైన పాత్రలు పోషించిన ఆమె, ‘అంధాధున్’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌తో యావత్ దేశాన్ని మెప్పించి అవార్డులను కొల్లగొట్టారు. ఇప్పుడు కింగ్ నాగార్జునకు ధీటైన విలన్‌గా ఆమె టాలీవుడ్లోకి స్ట్రాంగ్ రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే 99 సినిమాలతో అలరించిన నాగార్జున ఇప్పుడు 100వ సినిమాతో ఈ తరం యువతను కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కింగ్ కెరీర్లో మైల్ స్టోన్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
