Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్లో షాకింగ్ ఘటన.. విషపురుగు కాటు.. ఐసీయూలో నటుడు!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ' (Fauji) షూటింగ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Prabhas Fauji Actor Rajesh Sharma hospitalized after insect bite
Fauji : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న ప్రముఖ నటుడు రాజేష్ శర్మ విషపురుగు కాటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని సమాచారం.
షూటింగ్ ముగిసిన తరువాత రాజేష్ శర్మ సెట్లోని కొందరు టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా ఒక విష పురుగు ఆయన కుడికాలి పాదంపై కుట్టింది. ఆ సమయంలో ఆయన అది ఓ సాధారమైన పురుగే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే కుడికాలిలో తీవ్రమైన నొప్పి, శరీరమంతా నొప్పులు, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. మెరుగైన చికిత్స కోసం ఆయన స్వస్థలమైన కోల్కతాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Anasuya : నాగబంధం మూవీ షూటింగ్ సిల్ట్స్ షేర్ చేసిన అనసూయ.. ఫోటోలు వైరల్
హైదరాబాద్ నుంచి కోల్కతాకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. రక్తంలో చక్కెర స్థాయులు పెరగడంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. విమానం కోల్కతా చేరుకున్న వెంటనే రాజేష్ శర్మను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో విషపురుగు కాటు కారణంగా పాదం నుంచి మోకాలి వరకు ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించినట్లు గుర్తించినట్లు సమాచారం. జ్వరం తగ్గకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా.. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.
