Kousalya Tanaya Raghava Trailer Released
Kousalya Tanaya Raghava : రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై అడపా రత్నాకర్ నిర్మాణంలో స్వామి పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కౌసల్య తనయ రాఘవ. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా కౌసల్య తనయ రాఘవ ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ చూస్తుంటే 1986 లో లవ్ స్టోరీ. ప్రేమలో కులాలు అడ్డు రావడం, చదువు ఇంపార్టెన్స్ చెప్తూ ఛాగింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో రాజేష్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్యూ. కౌసల్య తనయ రాఘవ సినిమా అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 11న ఈ సినిమా రానుంది అని అన్నారు. డైరెక్టర్ స్వామి పట్నాయక్ మాట్లాడుతూ.. కౌసల్య తనయ రాఘవ సినిమాకు నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్యూ. నిర్మాత రత్నాకర్ ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు అని తెలిపారు.
Also Read : Ashu Reddy : నా లైఫ్ మొత్తంలో బావ అని పిలిచింది అతన్నే.. అతను హీరో మెటీరియల్.. స్టేజి మీద పులి..
నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ.. మా సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి అని తెలిపారు. నటుడు ఆర్కే నాయుడు మాట్లాడుతూ.. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను చూసే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఇందులో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఆ కారెక్టర్ అందరికీ నచ్చుతుంది అని అన్నారు.