Varun Tej: రవి తేజకు డిజాస్టర్ ఇచ్చాడు.. మెగా హీరోకి హిట్ ఇస్తాడా.. ఇద్దరికీ చాలా స్పెషల్..
సినీ ఇండస్ట్రీలో చాలా మంది హిట్ కాంబినేషన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ, మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) మాత్రం వరుసగా ప్లాప్స్ ఇచ్చిన దర్శకులకి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు.

Varun tej doing his next movie with Director Vikram sirikonda
Varun Tej: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హిట్ కాంబినేషన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ, మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం వరుసగా ప్లాప్స్ ఇచ్చిన దర్శకులకి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే, చాలా కాలంగా వరుణ్ కి కూడా సరైన విజయం రాలేదు. తొలిప్రేమ తరువాత ఆయన నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. ఈ నేపథ్యంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీకి ఛాన్స్ ఇచ్చాడు వారు తేజ్. ఇండో-కొరియన్ బ్యాక్డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్(Varun Tej) గా వస్తున్న ఈ సినిమా “కొరియన్ కనకరాజు” సినిమా టైటిల్ ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Krithi Shetty: మళ్ళీ నిరాశే ఎదురయ్యింది.. బాలీవుడ్ ప్రాజెక్టు నుంచి కూడా తీసేశారు.. పాపం కృతి శెట్టి
ఇక ఈ సినిమా విడుదలకు ముందే మరో ప్లాప్ డైరెక్టర్ చెప్పిన కథను ఒకే చేశాడు ఈ మెగా హీరో. ఆ దర్శకుడు మరెవరో కాదు విక్రమ్ సిరికొండ. ఈ దర్శకుడు చెప్పిన ఒక లవ్ స్టోరీ వరుణ్ తేజ్ కి విపరీతంగా నచ్చిందట. దాంతో, వెంటనే ఒకే చెప్పేశాడట వరుణ్ తేజ్. ఆయన కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ దర్శకుడు విక్రమ్ సిరికొండ విషయానికి వస్తే, గతంలో రవి తేజ హీరోగా “టచ్ చేసి చూడు” అనే మాస్ సినిమా చేశాడు. రాశిఖన్నా హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి చాలా మందికి ఈ సినిమా ఒకటి ఉందని కూడా తెలియదు. అలాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడికి మెగా ఛాన్స్ ఇచ్చాడు వరుణ్ తేజ్. మరి ఆయన నమ్మకాన్ని విక్రమ్ నిలుపుకుంటాడా అనేది తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే.