Krithi Shetty: మళ్ళీ నిరాశే ఎదురయ్యింది.. బాలీవుడ్ ప్రాజెక్టు నుంచి కూడా తీసేశారు.. పాపం కృతి శెట్టి

పాపం కృతి శెట్టికి బ్యాడ్ టైం నడుస్తోంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో (Krithi Shetty)ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఆ రేంజ్ లో హిట్ అవడంతో ఇక ఈ అమ్మడును ఆపడం ఎవరితరం కాదు అనుకున్నారు అంతా.

Krithi Shetty: మళ్ళీ నిరాశే ఎదురయ్యింది.. బాలీవుడ్ ప్రాజెక్టు నుంచి కూడా తీసేశారు.. పాపం కృతి శెట్టి

Kriti Shetty turns down Bollywood film offer

Updated On : October 18, 2025 / 10:21 AM IST

Krithi Shetty: పాపం కృతి శెట్టికి బ్యాడ్ టైం నడుస్తోంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఆ రేంజ్ లో హిట్ అవడంతో ఇక ఈ అమ్మడును ఆపడం ఎవరితరం కాదు అనుకున్నారు అంతా. మెగాస్టార్ చిరంజీవి సైతం అదే(Krithi Shetty) చెప్పాడు. అవకాశాలు కూడా అలానే వచ్చాయి. కానీ, ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. అందుకే, ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక టాలీవుడ్ గురించి చెప్పడం అనవసరం. శర్వానంద్ తో చేసిన మనమే సినిమా తరువాత ఒక్క అవకాశం కూడా రాలేదు.

Amala Akkineni: నా కోడళ్ళు అద్భుతమైన వారు.. వాళ్ళ వల్ల నా ప్రపంచం మారింది.. కోడళ్ల గురించి మొదటిసారి స్పందించిన అమల

ఇక అప్పటినుంచి ఇతర భాషల్లో అవకాశాల కోసం ఎదురుచూసింది. తమిళ, మళయాళ ఇండస్ట్రీలో ఒకటి, రెండు సినిమాలు చేసింది. కానీ, అక్కడ కూడా సమె సీన్ రిపీట్ అయ్యింది. ఇక చేసేది లేక అవకాశాల కోసం బాలీవుడ్ బాటపట్టింది. ఈక్రమంలోనే ఆమెకు బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా కుమారుడు యశ్వర్ధన్ తో నటించే అవకాశం దక్కించుకుంది. కనీసం ఈ సినిమాతో అయినా హిట్ అందుకొని వరుస అవకాశాలు దక్కించుకుంటుంది అనుకున్నారు కృతి ఫ్యాన్స్. కానీ, ఈ అమ్మడుకు మళ్ళీ నిరాశే ఎదురయ్యింది. అనుకోని కారణాల వల్ల ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తీసేశారట మేకర్స్. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా చేయనున్నారట మేకర్స్. ఇక ఈ న్యూస్ తెలియడంతో కృతి శెట్టి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

ఇక కృతి శెట్టి ప్రెజెంట్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి కార్తితో చేస్తున్న “వా వాతియార్” ఉంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న “లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ” అనే సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. మరి ఈ సినిమాలైనా ఆమెకు హిట్ ఇస్తాయా అనేది చూడాలి.