Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఈసారి ట్రిపుల్ ధమాకా.. సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. (Prabhas)ఆరోజు దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవల్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టేశారు కూడా.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఈసారి ట్రిపుల్ ధమాకా.. సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం..

Makers planning Three movie updates on Prabhas Birthday

Updated On : October 18, 2025 / 11:44 AM IST

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆరోజు దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవల్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టేశారు కూడా. అయితే, ఆ సెలబ్రేషన్స్ ను నెక్స్ట్ లెవల్ కు చేర్చుతూ తన ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వనున్నాడట ప్రభాస్. తాను హీరోగా చేస్తున్న సినిమాల అప్డేట్స్ ఇవ్వనున్నాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు (Prabhas)సినిమాల అప్డేట్స్ ఆరోజు రానున్నాయి. అందులో మొదటిది, రాజా సాబ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్. ఇటీవల దీనికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హింట్ ఇచ్చాడు. ప్రభాస్ ఇంట్రోలో వచ్చే ఈ పాటు నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందట.

Varun Tej: రవి తేజకు డిజాస్టర్ ఇచ్చాడు.. మెగా హీరోకి హిట్ ఇస్తాడా.. ఇద్దరికీ చాలా స్పెషల్..

ఇక రెండవది, దర్శకుడు హను రాఘవాపుడితో చేస్తున్న సినిమా నుంచి రానుంది. సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా నుంచి అప్డేట్ ప్రభాస్ పుట్టినరోజు న వస్తుంది అని దర్శకుడు హను ఇటీవలే ఒక ఫంక్షన్ లో చెప్పాడు. అది ఖచ్చితంగా టైటిల్ రివీలింగ్ అయ్యుంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇక మూడవది ఏంటంటే. బాహుబలి: ది ఎపిక్ అక్టోబర్ 31న విడుదల కానుంది. దీనికి సంబందించిన ఒక అప్డేట్ కూడా ప్రభాస్ బర్త్ డేన రానుంది అనే టాక్ నడుస్తోంది.

ఇక వరుసగా ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకేరోజు ఇన్ని అప్డేట్స్ వస్తుండటంతో ఆ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఇక ఈ సినిమాలే కాకుండా.. మరో మూడు భారీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న స్పిరిట్ ఉంది. రాజా సాబ్ రిలీజ్ తరువాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ప్రశాంత్ నీల్ తో సాలార్ 2 కూడా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా 2026 ఎండింగ్ లో మొదలుకానుంది. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ తో కల్కి 2 మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలా మొత్తానికి ఆరు సినిమాలను ప్రస్తుతం హ్యాండిల్ చేస్తున్నాడు ప్రభాస్. మరి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.