కంగనా ఖంగుతిందా?

మణికర్ణిక సినిమా గురించి రోజుకో రకమైన చర్చ జరుగుతుంది. క్రిష్, కంగనా విషయంలో తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉన్నాడు. క్రిష్ ట్వీట్‌పై కంగనా చెల్లి రంగోలి రెస్పాండ్ అవుతూ.. సినిమా మొత్తాన్నీ మీరే డైరెక్ట్ చేసారని ఒప్పుకుంటున్నాం, మా అక్కని సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చెయ్యనివ్వండి అంటూ దణ్ణం పెట్టింది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన మిస్తీ చక్రవర్తి కూడా కంగనాపై విమర్శలు చేసింది. తన క్యారెక్టర్ డ్యూరేషన్‌ని కావాలనే కంగనా తగ్గించేసిందనీ, క్రిష్ తర్వాత ఆమె కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిందనీ, కంగనా డైరెక్ట్ చేస్తుందని తెలిస్తే అసలు ఈ సినిమా ఒప్పుకునేదాన్నే కాదని.. మిస్తీ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే క్రిష్‌కి సోషల్ మీడియా వేదికగా చాలామంది తమ మద్దతు తెలుపుతున్నారు. జీవితాన్ని, సమాజాన్ని, ఎంతో లోతుగా చదివితే తప్ప.. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలు తియ్యలేరు. అంత గొప్ప భావాలున్న వ్యక్తి స్వార్థంగా ఉండడు… తప్పు చెయ్యడు..
మా సపోర్ట్ మీకెప్పుడూ ఉంటుంది అంటూ.. క్రిష్‌కి ఎంతోమంది సపోర్ట్ తెలియచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కంగనా ఇంకా సైలెంట్‌గానే ఉందంటే దానర్థం ఏమై ఉంటుందంటారు?