Krishnam Raju with Other Heros : 50 మల్టీస్టారర్ సినిమాలు.. ఎక్కువమందితో కలిసి చేసిన హీరో.. ఆయన రూటే సపరేట్..
స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా అందరి హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు కృష్ణంరాజు. ఆయన దాదాపు...............

Krishnam Raju Multistarer Movies with Other Heros
Krishnam Raju with Other Heros : రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ విషాదంలోకి వెళ్ళిపోయింది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని సంఘటనలని గుర్తు చేసుకుంటున్నారు. సాధారణంగా హీరోలు మల్టీస్టారర్స్ చేయాలంటే ఆలోచిస్తారు. సినిమాలో తమ పాత్రకి కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా అభిమానులు ఏమనుకుంటారో అని చాలా మంది వేరే హీరోలతో మల్టీస్టారర్లు అంత తొందరగా ఒప్పుకోరు. కానీ కృష్ణంరాజు తన కెరీర్ లో దాదాపు 50కి పైగా మల్టీస్టారర్ సినిమాలు చేసి తన రూటే సపరేట్ అనిపించుకున్నారు.
స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా అందరి హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు కృష్ణంరాజు. ఆయన దాదాపు 180 సినిమాల్లో నటిస్తే అందులో 50కిపైగా వేరే హీరోలతో కలిసి చేసినవే.
హీరో కృష్ణతో కలిసి అత్యధికంగా 17 సినిమాల్లో నటించారు. కృష్ణ, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలొచ్చాయి. ఏఎన్నార్ తో దాదాపు 7 సినిమాలు, ఎన్టీఆర్ తో 7 సినిమాలు, శోభన్ బాబుతో 5 సినిమాలు పైగా, చిరంజీవితో 5 సినిమాలు కలిసి నటించారు. మోహన్‌బాబు, బాలకృష్ణ, శ్రీకాంత్, రాజశేఖర్, జగపతిబాబు, సుమన్, నాగార్జున, రాజేంద్రప్రసాద్, వెంకటేష్, నితిన్, ప్రభాస్, ఉదయ్ కిరణ్, నాని.. ఇలా చాలా మంది హీరోలతో ఆయన కలిసి నటించారు. ఈ విషయంలో కృష్ణంరాజు నేటి తరం హీరోలకి ఆదర్శంగా నిలిచారు.