Krithi Sanon rejected in some movie auditions
Krithi Sanon : బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తుంది. ఎప్పటిలాగే కరణ్ తన పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పర్సనల్ ప్రశ్నలతో వచ్చే గెస్టులని ఇబ్బందిపెడుతూనే ఉన్నాడు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా కృతి సనన్, టైగర్ ష్రాఫ్ జంటగా వెళ్లారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఇందులో కృతి సనన్ ని నువ్వెప్పుడైనా ఆడిషన్ కి వెళ్ళావా? నిన్ను ఎవరైనా రిజెక్ట్ చేశారా? నీకు మిస్ అయిన సినిమాలు ఉన్నాయా అని అడిగాడు.
దీనికి కృతి సనన్ సమాధానమిస్తూ.. ”నన్ను రిజెక్ట్ చేసింది మీరే. నేను మొదట ఆడిషన్‌కు వెళ్లిన సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -1’. ఆ సినిమాకి డైరెక్టర్ మీరే. నాకు అవకాశం ఇవ్వలేదు” అని తెలిపింది. అలాగే కరణ్‌జోహార్ దర్శకత్వం వహించిన ‘లస్ట్ స్టోరీస్’ ఆడిషన్స్‌లో కూడా పాల్గొన్నాను అని తెలిపింది. దానికి నేను సెలెక్ట్ అయ్యాను కానీ లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరీ అంత బోల్డ్ సీన్స్ అంటే మా అమ్మ ఒప్పుకోదు. కొన్ని బోల్డ్ సీన్స్ తీసేస్తే నటిస్తానని కరణ్ ని అడిగాను అప్పుడు, కానీ అంతలోనే కియారా బోల్డ్ సీన్స్ తో ఆ పాత్రని చేస్తానని ఒప్పుకోవడంతో ఆ సినిమా కియారా అద్వానీకి వెళ్ళిపోయింది. ఇలా రెండు సార్లు కరణ్ జోహార్ సినిమాల్లో ఛాన్స్ మిస్ అయిందని కృతి సనన్ తెలిపింది.
Janhvi Kappor : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. లంగాఓణిలో జాన్వీ కపూర్ సందడి..
అలాగే కెరీర్ ప్రారంభంలో నా హైట్ సమస్యగా ఉండేది. నేను ఎక్కువ హైట్ ఉన్నానని, కొంతమంది హీరోల పక్కన నేనే హైట్ కనిపిస్తాను అని రిజెక్ట్ చేశారు అని తెలిపింది కృతి సనన్. బాలీవుడ్ లో తనని ఎన్ని సినిమాలు రిజెక్ట్ చేసినా కష్టపడి ట్రై చేసి ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసన ఆదిపురుష్ లో నటించే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది కృతి.