Krithi Shetty got heroine chance in Jayam Ravi pan India project Genie
Krithi Shetty : ఉప్పెన (Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయిన కృతి శెట్టి.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ అందుకొని టాప్ హీరోయిన్ రేస్ లో నిలిచింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాప్స్ అవ్వడం, తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో సెలెక్ట్ అయ్యినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోవడంతో.. ఈ అమ్మడు ఆశలు అన్ని కస్టడీ సినిమా పై పెట్టుకుంది. కానీ అది కూడా నిరాశ పరిచింది. దీంతో కృతి చేతిలో.. మలయాళంలో టోవినో థామస్ సరసన చేస్తున్న సినిమా ఒకటే మిగిలింది.
అయితే బెబమ్మ ఖాతాలోకి ఇప్పుడు మరో సినిమా వచ్చిపడింది. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి చేయబోతున్న ‘జీని’ (Genie) అనే సినిమాలో కృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ బుధవారం (జులై 5) చెన్నైలో ఘనంగా జరిగింది. కృతి శెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి కూడా హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఒకప్పటి హీరోయిన్ దేవయాని కీలక పాత్రలో నటిస్తుంది. అర్జునన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా ఐసరి, కె గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Samantha : సమంతకు టెడ్డీబేర్ గిఫ్ట్.. ఎవరు ఇచ్చారో తెలుసా..?
ఈ బ్యానర్ లో వస్తున్న 25వ సినిమా కావడంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. మహేష్ ముత్తుస్వామి సినిమాటోగ్రపీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పలు హాలీవుడ్, ఇంటర్నేషనల్ మూవీస్‌కు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన యానిక్ బెన్ ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో కృతి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? లేదా? చూడాలి.
Krithi Shetty got heroine chance in Jayam Ravi pan India project Genie
Krithi Shetty got heroine chance in Jayam Ravi pan India project Genie